Homeటాప్ స్టోరీస్మహేష్ కోసం ఫైటింగ్ చేసాడట విజయ్ దేవరకొండ

మహేష్ కోసం ఫైటింగ్ చేసాడట విజయ్ దేవరకొండ

vijay devarakonda sensational comments on mahesh babuమహేష్ బాబు నటించిన సినిమాలను చూడటానికి నేను పోటీ పడ్డానని , అసలు టికెట్ల కోసం ఫైటింగ్ చేసానని అలాంటిది ఇప్పుడు మహేష్ బాబు స్వయంగా కలిసి మాట్లాడటం చాలా సంతోషంగా ఉందని అంటున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ . ఇటీవలే మహేష్ బాబు నటిస్తున్న మహర్షి చిత్ర షూటింగ్ లొకేషన్ కి వెళ్ళాడు విజయ్ దేవరకొండ . అయితే ఇటీవలే విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం విడుదలై సూపర్ హిట్ అయిన నేపథ్యంలో విజయ్ ని పొగడ్తలతో ముంచెత్తాడు మహేష్ .

తన అభిమాన హీరో తనపై ప్రశంసలు కురిపించడంతో ఉబ్బి తబ్బిబ్బై పోతున్నాడు విజయ్ . మహేష్ బాబు సినిమాల కోసం , టికెట్ల కోసం క్యూలో నిలబడి పోరాటం చేసాడట ! క్యూలో నిలబడి టికెట్లు తీసుకొని మహేష్ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేసిన విజయ్ కి అదే హీరో ఎదురుగా నిలబడి పొగుడుతూ ఉంటే అది గొప్ప విషయమే ! అందుకే ఆ సంతోషాన్ని తన అభిమానులతో పంచుకోవడానికి సోషల్ మీడియాని వాడుకున్నాడు విజయ్ దేవరకొండ .

- Advertisement -

English Title: vijay devarakonda sensational comments on mahesh babu

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All