Thursday, August 11, 2022
Homeఎక్స్ క్లూసివ్క్షమాపణ చెప్పిన విజయ్ దేవరకొండ

క్షమాపణ చెప్పిన విజయ్ దేవరకొండ

అర్జున్ రెడ్డి చిత్రంతో ఒక్కసారిగా స్టార్ అయిపోయిన విజయ్ దేవరకొండ ట్రాఫిక్ పోలీసులకు క్షమాపణ చెప్పాడు . క్షమాపణ చెప్పేంత తప్పు విజయ్ దేవరకొండ చేశాడా ? అంటే చేసాడు కానీ ……. అది నిజంగా కాదు సినిమాలో …… అది కూడా అర్జున్ రెడ్డి సినిమాలో . బేక్ పై స్పీడ్ గా వెళుతూ సిగరెట్ కాల్చుతూ గుప్పు గుప్పున పొగ వదులుతూ వెళ్తాడు అర్జున్ రెడ్డి చిత్రంలో అయితే అక్కడ హెల్మెట్ వాడడు అందుకే సారీ చెప్పాడు . 
 
ప్రతీ ఏటా యాక్సిడెంట్ జరిగి వందలాది మంది చనిపోతున్నారు దాంతో హెల్మెట్ తప్పనిసరి అంటూ ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ గురించి రకరకాల ప్రచారాలు చేస్తున్నారు . తాజాగా అర్జున్ రెడ్డి లో విజయ్ దేవర కొండ బైక్ పై వెళుతున్న స్టిల్ ని పెట్టి హెల్మెట్ లేదు ఇలా వెళ్ళకూడదు అంటూ పెట్టడమే కాకుండా హెల్మెట్ పెట్టుకొని వెళ్లాలంటూ డిజైన్ చేసి ట్విట్టర్ లో పోస్ట్ చేసారు ట్రాఫిక్ పోలీసులు . దాంతో అర్జున్ రెడ్డి అలియాస్ విజయ్ దేవరకొండ సారీ మామా అంటూ పోస్ట్ చేసాడు .

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts