Homeటాప్ స్టోరీస్మహానటి నిర్మాతలతో విజయ్ దేవరకొండ మరో సినిమా

మహానటి నిర్మాతలతో విజయ్ దేవరకొండ మరో సినిమా

vijay devarakonda next movie with mahanati producersమహానటి వంటి సంచలన విజయాన్ని సాధిస్తున్న చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలు స్వప్న దత్ , ప్రియాంక దత్ లతో యంగ్ హీరో విజయ్ దేవరకొండ మరో సినిమా చేయడానికి ఇంతకుముందే అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే . అయితే వరుస విజయాలు సాధిస్తున్న విజయ్ దేవరకొండ తో వరుసగా సినిమాలు చేయాలనీ పలువురు దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు . పోటీ ఎక్కువ కావడంతో విజయ్ దేవరకొండ తదుపరి సినిమా ఎవరితో అన్న చర్చ మొదలయ్యింది . అయితే విజయ్ తన తదుపరి చిత్రాన్ని మళ్ళీ మహానటి నిర్మాతలతోనే చేయాలనీ డిసైడ్ అయ్యాడట .

మహానటి కంటే ముందు విజయ్ దేవరకొండ కు లైఫ్ ఇచ్చింది ఈ నిర్మాతలే ! నాని హీరోగా నటించిన ” ఎవడే సుబ్రహ్మణ్యం ” చిత్రాన్ని నిర్మించింది స్వప్న దత్ , ప్రియాంక దత్ లే ! కాగా ఆ సినిమాలో కీలక పాత్ర పోషించాడు విజయ్ దేవరకొండ . ఆ సినిమా విజయ్ కి చాలా మంచి గుర్తింపు ని ఇచ్చింది . విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు దక్కాయి కట్ చేస్తే పెళ్లి చూపులు చిత్రంతో సంచలనం సృష్టించాడు . దాని తర్వాత అర్జున్ రెడ్డి ఎంతటి ప్రభంజనం సృష్టించిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు . ఇక ఇప్పుడేమో మహానటి తో మరో అపురూప విజయం అందుకున్నాడు కాగా తన తదుపరి సినిమా కూడా మహానటి నిర్మాతలకు చేయాలనీ డిసైడ్ అయ్యాడట విజయ్ దేవరకొండ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All