Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండ ఫేక్ ఫోటోస్ వైరల్

విజయ్ దేవరకొండ ఫేక్ ఫోటోస్ వైరల్

Vijay devarakonda morphing photos goes viralగీత గోవిందం చిత్రంతో ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ దాంతో అతడికి సంబందించిన ప్రతీ విషయాన్నీ తెలుసుకోవడానికి ఆతృతగా వెదుకుతున్నారు నెటిజన్లు . ఇక విజయ్ దేవరకొండ కి ఎక్కడా లేని క్రేజ్ రావడంతో అతడి మీద అభిమానంతో కొంతమంది అలాగే అసూయతో కొంతమంది రకరకాల ఫోటోలను మార్ఫింగ్ చేస్తున్నారు , తాజాగా విజయ్ దేవరకొండ ఓ యువతితో సన్నిహితంగా ఉన్నట్లుగా ఫోటోలను మార్ఫింగ్ చేసి నెట్ లో వదిలారు ఇంకేముంది ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . అసలే యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో కావడంతో ఆ ఫోటోలు సెన్సేషన్ సృష్టించాయి సోషల్ మీడియాలో .

నెటిజన్లు పెద్ద ఎత్తున ఆ ఫోటోల కోసం వెదుకులాట ప్రారంభించడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి . అవి నిజమైనవి కాదు ఫేక్ ఫోటోలని , ఎవరో కావాలని మార్ఫింగ్ చేసి తమ ప్రతిభని నిరూపించుకున్నారు అంతే ! ఇటీవలే గీత గోవిందం చిత్రంతో ప్రభంజనం సృష్టించిన విజయ్ దేవరకొండ వచ్చే నెలలో నోటా చిత్రంతో ప్రేక్షకులను పలకరించడానికి సమాయత్తం అవుతున్నాడు . రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన నోటా తెలుగు , తమిళ బాషలలో రూపొందింది .

- Advertisement -

English Title: Vijay devarakonda morphing photos goes viral

Vijay devarakonda morphing photos goes viral

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All