Homeటాప్ స్టోరీస్విజ‌య్ దేవ‌ర‌కొండ నెక్స్ట్ ఎవ‌రితో.. చేప్పేశాడు!

విజ‌య్ దేవ‌ర‌కొండ నెక్స్ట్ ఎవ‌రితో.. చేప్పేశాడు!

విజ‌య్ దేవ‌ర‌కొండ నెక్స్ట్ ఎవ‌రితో.. చేప్పేశాడు!
విజ‌య్ దేవ‌ర‌కొండ నెక్స్ట్ ఎవ‌రితో.. చేప్పేశాడు!

టాలీవుడ్ సెన్సేష‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ప్ర‌స్తుతం సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా స్థాయిలో `ఫైట‌ర్‌` మూవీ చేస్తున్న విష‌యం తెలిసిందే. పూరి, చార్మితో క‌లిసి క‌ర‌ణ్‌జోహార్‌, అపూర్వ మెహ‌తా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్‌ ఇప్ప‌టి వ‌ర‌కు ముంబై వీధుల్లో ప‌లు కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణతో దాదాపు 40 శాతం పూర్త‌యింది.

హైద‌రాబాద్‌లో మ‌రో క‌ల‌క షెడ్యూల్ ప్రారంభించాల్సి వుంది. అయితే క‌రోనా కార‌ణంగా షూటింగ్ ఆగిపోయింది. లాక్‌డౌన్ త‌రువాత ప‌రిస్థితులని బ‌ట్టి షూటింగ్ మ‌ళ్లీ ప్రారంభించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా వుంటే ఈ సినిమా త‌రువాత శివ నిర్వాణ ద‌ర్శ‌కత్వంలో దిల్‌రాజు నిర్మించ‌నున్న చిత్రాన్ని అంగీక‌రించారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న ఇటీవ‌లే దిల్ రాజు ప్ర‌క‌టించారు కూడా. ఇది విజ‌య్ దేవ‌ర‌కొండ 12వ చిత్రం.

- Advertisement -

దీని త‌రువాత కూడా మ‌రో చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణంలోనే చేయ‌బోతున్న‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వినిపించాయి. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఈ విష‌యంపై విజ‌య్ దేవ‌ర‌కొండ హింట్ ఇచ్చారు. త‌న‌‌ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ విష్ చూస్తూ ఈ ఏడాది నీ నుంచి అద్భుత‌మైన చిత్రాలు రావాల‌ని కోరుకుంటున్నాను ` అని ఓ పోస్ట్ పెట్టారు. దానికి రిప్లైగా ఆ  అద్భుతాన్ని ఇద్ద‌రం క‌లిసి చేయ‌బోతున్నాం` అరి ట్వీట్ చేసి ఇద్ద‌రి క‌ల‌యిక‌లో సినిమా రాబోతోందంటూ క్లారిటీ ఇచ్చారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All