Homeటాప్ స్టోరీస్భయపడొద్దంటున్న విజయ్ దేవరకొండ

భయపడొద్దంటున్న విజయ్ దేవరకొండ

Vijay Devarakonda
Vijay Devarakonda

రౌడీస్ జీవితంలో భయపడితే సాధించేది ఏమి లేదు ! భయాన్ని వీడండి తప్పకుండా విజయం సాధిస్తారు అంటూ తన అభిమానుల్లో జోష్ పెంచాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ . నిన్న జరిగిన డియర్ కామ్రేడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడి వాళ్లలో జోష్ పెంచాడు . నేను కూడా యాక్టర్ అయితనా అనే భయం ఉండేది , అట్లాగే ఈ మ్యూజికల్ ఫెస్ట్ అనుకున్నాం కానీ ఎట్లా చేస్తం అనుకున్నా కానీ వాటినన్నింటిని అధిగమించి ఈరోజు ఇలా మీ అందరి సహకారంతో విజయవంతం అయ్యింది అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు విజయ్ దేవరకొండ .

డియర్ కామ్రేడ్ చిత్రం ఈనెల 26 న విడుదల అవుతున్న నేపథ్యంలో విజయ్ చాలా ఎమోషనల్ అయ్యాడు . అంతేకాదు తన ఫ్యాన్స్ ని అలరించడానికి యాంకర్ గా , డ్యాన్సర్ గా సింగర్ గా పలు రకాల అవతారాలు ఎత్తాడు మెప్పించాడు కూడా . భయం వీడితే సక్సెస్ మనదే అంటూ యువతని ఉత్సాహపరిచాడు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All