Homeటాప్ స్టోరీస్సైనికుల కోసం సహాయం అందించిన విజయ్ దేవరకొండ

సైనికుల కోసం సహాయం అందించిన విజయ్ దేవరకొండ

Vijay devarakonda contribution for soldiersజమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఘోర ఉగ్ర దాడిలో 42 మంది భారత సైనికులు చనిపోయిన విషయం తెలిసిందే . అయితే ఈ సంఘటనతో యావత్ భారత జాతి పాక్ పై భగ్గుమంటోంది . ఇక వీర జవాన్ల కు అండగా ఉంటామని పలువురు ప్రతిన బూనుతున్నారు కాగా హీరో విజయ్ దేవరకొండ మాత్రం మిగతా వాళ్ళ లా పోస్ట్ పెట్టకుండా వీర జవాన్ల సహాయ నిధికి పెద్ద మొత్తంలో డబ్బు పంపించి తన హీరోయిజాన్ని చాటుకున్నాడు .

 

- Advertisement -

అయితే ఎంత మొత్తం అనేది మాత్రం వెల్లడించలేదు ఈ హీరో . జాతి యావత్తు హాయిగా నిద్ర పోతోంది అంటే అందుకు కారణం సరిహద్దులో భద్రతా బలగాల త్యాగమే అంటూ వారే నిజమైన హీరోలు అంటూ కీర్తిస్తున్నారు యావత్ భారతీయులు . ఇక విజయ్ దేవరకొండ కూడా వీర సైనికులే నిజమైన హీరోలు అంటూ కీర్తిస్తూ తన వంతు సహాయంగా ఆర్ధిక సహాయం ని అందించాడు . అంతేకాదు దాని తాలూకు రిసిప్ట్ ని కూడా ట్వీట్ చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు విజయ్ దేవరకొండ . ఇంతకుముందు కూడా పలు సందర్భాల్లో సహాయాన్ని అందించాడు ఈ హీరో .

 

English Title: Vijay devarakonda contribution for soldiers

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All