Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండ చేసిన పెద్ద తప్పు అదే !

విజయ్ దేవరకొండ చేసిన పెద్ద తప్పు అదే !

Dear Comrade
Dear Comrade

టాలీవుడ్ నయా సూపర్ స్టార్ గా అవతరించిన విజయ్ దేవరకొండ తాజాగా డియర్ కామ్రేడ్ చిత్రంతో షాక్ అయ్యాడు . ఎన్నో ఆశలు పెట్టుకొని ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం , కన్నడం , మలయాళం ఇలా దక్షిణాదిన నాలుగు బాషలలో విడుదల చేసారు కానీ ఏమైంది అన్ని చోట్లా ఘోరమైన ఫలితాన్ని చవిచూసింది . ఎన్నో ఆశలతో నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తే నాలుగు భాషల్లో కూడా ప్లాప్ అయ్యింది .

దాంతో ఎక్కడ తప్పు చేశామా ? అన్న అంతర్మథనం మొదలయ్యిందట ! డియర్ కామ్రేడ్ కథ బాగానే ఉన్నపటికీ సినిమా నిడివి పెద్ద మైనస్ అనే చెప్పాలి . అలాగే స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా చెప్పదలచుకున్నది రెండు గంటల్లో చెప్పకుండా సాగతీత సన్నివేశాలతో 3 గంటల పాటు చేసారు అదే విజయ్ దేవరకొండ , భరత్ కమ్మ చేసిన పెద్ద తప్పు దానికి భారీ మూల్యం చెల్లించారు . ఇదే కథని రెండున్నర గంటల్లో తేల్చి పడేస్తే తప్పకుండా బ్లాక్ బస్టర్ అయ్యేది నాలుగు భాషల్లో కూడా .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All