Homeటాప్ స్టోరీస్ఇద్దరు హీరోలు మిస్ చేసుకున్న ఆర్ ఎక్స్ 100

ఇద్దరు హీరోలు మిస్ చేసుకున్న ఆర్ ఎక్స్ 100

vijay devarakonda and sudheer babu rejected super hit filmఆర్ ఎక్స్ 100 చిత్రం ఇటీవల విడుదలై సంచలన విజయం సాధిస్తున్న విషయం తెలిసిందే . కేవలం నాలుగు రోజుల్లోనే 5 కోట్లకు పైగా షేర్ ని సాధించింది ట్రేడ్ విశ్లేషకులను అలాగే ఓ ఇద్దరు హీరోలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది . ట్రేడ్ విశ్లేషకులు సరే ఇద్దరు హీరోలకు ఎందుకు ఆశ్చర్యం అంటే మొదట ఈ కథ ని తీసుకొని విజయ్ దేవరకొండ దగ్గరకు అలాగే సుధీర్ బాబు దగ్గరకు వెళ్ళాడట దర్శకులు అజయ్ భూపతి కానీ వాళ్ళు ఆ కథ విని సినిమా చేయలేదు కట్ చేస్తే కొత్త కుర్రాడు కార్తికేయ చేసాడు బ్లాక్ బస్టర్ కొట్టేసాడు .

పెళ్లి చూపులు షూటింగ్ సమయంలోనే విజయ్ దేవరకొండ ని ఆశ్రయించాడట అజయ్ భూపతి అయితే కథ విన్నాక ఎందుకో కానీ విజయ్ దేవరకొండ డేట్స్ ఇవ్వలేకపోయాడు దాంతో మహేష్ బాబు బావ హీరో సుధీర్ బాబు ని కలిసి కథ చెప్పాడట దర్శకులు అజయ్ భూపతి . అయితే సుధీర్ బాబు మూడు నెలల పాటు నాన్చి తీరా సమయానికి హ్యాండ్ ఇచ్చాడట దాంతో కార్తికేయ కు ఈ ఛాన్స్ లభించింది . కట్ చేస్తే యూత్ ని విపరీతంగా ఆకర్షిస్తూ వసూళ్లు భారీగా రాబడుతోంది . బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉదనటంతో కాబోలు ఆ ఇద్దరు హీరోలు రిజెక్ట్ చేసి ఉంటారు దాంతో కొత్త హీరో ఇండస్ట్రీ కి లభించాడు . అయితే కమర్షియల్ హిట్ కోసం పాకులాడుతున్న మహేష్ బాబు బావ సుధీర్ బాబు మాత్రం పెద్ద హిట్ మిస్ చేసుకున్నాడు .

- Advertisement -

English Title: vijay devarakonda and sudheer babu rejected super hit film

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All