
ఒకప్పుడు టాలీవుడ్ చిత్రాలంటే మూస చిత్రాలని కొట్టిపారేసేవారు..కానీ ఇప్పుడు ఆలా కాదు టాలీవుడ్ నుండి ఓ సినిమా వస్తుందంటే అందరి చూపు దానిపైనే ఉంది. బాలీవుడ్ చిత్రాలను తలదన్నేలా మన తెలుగు చిత్రాలు సత్తా చాటుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ పెంచుకొని సక్సెస్ సాధిస్తున్నాయి. వచ్చే వారం ఆర్ఆర్ఆర్ రాబోతుంది. ఈ మూవీఫై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ఎంత చెప్పిన తక్కువే..ఇదిలా ఉంటె విజయ్ దేవరకొండ – అనన్య పాండే జంటగా పూరి డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ లైగర్. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ మూవీ ఫై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఓవైపు షూటింగ్‌లో బిజీగా ఉంటూనే, మరోవైపు పార్టీ మూడ్‌ని ఎంజాయ్ చేస్తుంది లైగర్ టీం.
గురువారం ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అపూర్వ మెహతా పుట్టినరోజు సందర్భంగా ముంబైలో గ్రాండ్ పార్టీ నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ పార్టీలో లైగర్ బ్యాచ్ బ్లాక్ అండ్ బ్లాక్‌లో మోస్ట్ స్టైలిష్ లుక్‌తో మెస్మరైజ్ చేశారు. అయితే విజయ్ దేవరకొండ – అనన్య మాట్లాడుతుండగా ఛార్మి వీడియో తీసి దానిని సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో వారు ఏమాట్లాడుకుంటున్నారబ్బా అని అంత మాట్లాడుకుంటున్నారు.