
స్టార్ డైరెక్టర్‌పై రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఒక్క అప్ డేట్ ప్లీజ్ అంటూ ప్రాధేయపడుతున్నారు. వరుస ట్వీట్‌లతో సదరు స్టార్ డైరెక్టర్‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఆయనని విజ్ఞప్తి చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే…టాలీవుడ్ సెన్సేషనల్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పాన్ ఇండియా స్థాయిలో `లైగర్` చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీని కరణ్ జోహార్, అపూర్వ మెహతాలతో కలిసి పూరి జగన్నాథ్, చార్మి ఈ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. గత ఏడాది మార్చిలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైనా మళ్లీ కోవిడ్ ప్రబలడంతో మరోసారి ఆగిపోయింది.
ఇదిలా వుంటే దర్శకుడు పూరి జగన్నాథ్‌ని విజయ్ ఫ్యాన్స్ వరుస ట్వీట్‌లతో రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ నెల 9న చిన్న అప్‌డేట్ ఇవ్వాలని పూరిని అభ్యర్థిస్తున్నారు. ఈ నెల 9న రౌడీ హీరో విజయ్ దేవరకొండ పుట్టిన రోజు. ఈ సందర్భంగా స్పెషల్ అప్‌డేట్ ఇవ్వాల్సిందే అంటూ రౌడీ ఫ్యాన్స్ దర్శకుడు పూరి జగన్నాథ్‌ని ట్వీటట్లతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారట. పూరి మాత్రం వారికి ఎలాంటి రిప్లై ఇవ్వడం లేదు. అంతా ఎదురుచూస్తున్నట్టే విజయ్ దేవరకొండ పుట్టిన రోజున పూరి `లైగర్` అప్‌డేట్‌ని అందిస్తాడా? లేదా అన్నది తెలియాలంటే మరో మూడు రోజుల వేచి చూడాల్సిందే.