
నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో ఇళయదళపతి విజయ్ నటించిన చిత్రం ‘బీస్ట్’. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. సెల్వ రాఘవన్, యోగి బాబు తదితరులు కీలక పాత్రలు చేసిన ఈ మూవీ భారీ అంచనాల నడుమ నిన్న వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో విడుదలై నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ ఫస్ట్ డే కలెక్షన్ల వర్షం కురిపించింది.
తమిళనాడు లో తొలి రోజున ఏకంగా 18.75 కోట్లు రాబట్టింది. విజయ్ కెరీర్‌లో ఇదే హయ్యెస్ట్ కలెక్షన్లు కావడం విశేషం. సింగపూర్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 300k సింగపూర్ డాలర్లను వసూలు చేయడం రికార్డుగా చెప్పుకొంటున్నారు. విజయ్ కెరీర్‌లో ఇదే అత్యుత్తమ కలెక్షన్ రిపోర్ట్. ఆల్ టైమ్ రికార్డు అని సినీ, ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఓవర్సీస్ లో 5.7 కోట్లు వసూలు చేసింది. తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా రూ.85 నుంచి 90 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఏరియా వైజ్ కలెక్షన్లు తెలియాల్సి ఉంది.