Homeటాప్ స్టోరీస్బిచ్చగాడు హీరో కాశితో హిట్ కొడతాడా

బిచ్చగాడు హీరో కాశితో హిట్ కొడతాడా

vijay antony hopes on kaasiబిచ్చగాడు చిత్రంతో తెలుగునాట సంచలన విజయం సాధించిన బిచ్చగాడు చిత్రంతో తెలుగునాట మంచి మార్కెట్ ఏర్పాటు చేసుకున్నాడు తమిళ హీరో విజయ్ ఆంటోనీ . బిచ్చగాడు తర్వాత విజయ్ ఆంటోనీ నటించిన పలు చిత్రాలు తెలుగులో డబ్ అయ్యాయి అయితే అవేవి పెద్దగా ఆదరణకు నోచుకోలేదు కాకపోతే బిచ్చగాడు ప్రభావంతో కొంత వరకు ఓపెనింగ్స్ రాబట్టాయి దాంతో విజయ్ ఆంటోనీ చిత్రాలకు ఇంకా డిమాండ్ ఉంది . దాంతో తాజాగా కాశి చిత్రాన్ని కూడా దక్కించుకోవడానికి పలువురు పోటీ పడ్డారు . రకరకాల వివాదాల అనంతరం ఈరోజు విడుదలకు సిద్దమయ్యింది కాశి చిత్రం .

బిచ్చగాడు తర్వాత ఆ స్థాయి హిట్ కోసం విజయ్ ఆంటోనీ చాలా కష్టాలు పడుతూనే ఉన్నాడు కానీ ఆ స్థాయి విజయం మాత్రం దక్కించుకోలేక పోతున్నాడు . అయితే ఈ కాశి చిత్రం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు విజయ్ ఆంటోనీ . ఈరోజు తెలుగులో అలాగే తమిళ్ లో విడుదల అవుతోంది , మరి బిచ్చగాడు లా కాశి చిత్రం విజయం సాధిస్తుందా ? లేక మిగతా చిత్రాల్లాగే కాశి కూడా చేరి పోతుందా చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All