
‘తలపతి’ విజయ్ కి తమిళనాట ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఈయన నుండి సినిమా వస్తుందంటే పెద్ద పండగలా భావిస్తారు. అలాంటి విజయ్ ఫస్ట్ టైం తెలుగు లో సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తన 66 వ చిత్రంగా ఇది రాబోతుంది. దీనికి సంబదించిన పూజా కార్య క్రమాలు ఈరోజు చెన్నై లో అట్టహాసంగా జరిగాయి. ఈ మూవీ లో విజయ్ కి జోడిగా రష్మిక నటిస్తుంది.
ఈ కార్యక్రమంలో హీరో విజయ్, హీరోయిన్ రష్మిక మందన్న, సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్, దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజుతో పాటు తదితరులు పాల్గొన్నారు. ముహూర్త పూజతో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను కూడా ప్రారంభించారు. ముందుగా పాటతో షూటింగ్ మొదలుపెట్టారు. ఈ నెల 13న విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బీస్ట్’ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. సన్ పిక్చర్ పతాకంపై కళానిది మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.