Homeటాప్ స్టోరీస్స్టైలిష్ లుక్‌లో విక్ట‌రీ వెంక‌టేష్‌!

స్టైలిష్ లుక్‌లో విక్ట‌రీ వెంక‌టేష్‌!

స్టైలిష్ లుక్‌లో విక్ట‌రీ వెంక‌టేష్‌!
స్టైలిష్ లుక్‌లో విక్ట‌రీ వెంక‌టేష్‌!

టాలీవుడ్‌లో వున్న సీనియ‌ర్ హీరోల్లో విక్ట‌రీ వెంక‌టేష్ శైలి ప్ర‌త్యేకం. `ఎఫ్‌2` త‌ర‌హా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్ తో పాటు `నార‌ప్ప‌` లాంటి మాస్ మ‌సాలా యాక్ష‌న్ చిత్రాల‌ని చేయ‌గ‌ల‌రాయ‌న‌. గ‌త ఏడాది ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `ఎఫ్ 2`తో  వంద కోట్ల క్ల‌బ్‌లో చేరి ట్రేడ్ పండితుల్నిసైతం ఆశ్చ‌ర్యానికి గురిచేశారు. వెంకీ ఆస‌న్‌తో ఈ మూవీలో మెస్మ‌రైజ్ చేసిన వెంక‌టేష్ ప్ర‌స్తుతం `నార‌ప్ప‌`గా త‌న వ‌య‌సుకి త‌గ్గ పాత్ర‌తో త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు.

త్వ‌ర‌లో `ఎఫ్‌3` సీక్వెల్‌లో న‌టించ‌నున్న వెంక‌టేష్ ఈ ఆదివారం 60వ వ‌సంతంలోకి అడుగుపెడుతున్నారు. ఆదివారం ఆయ‌న పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేకంగా వెంక‌టేష్ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఈ ఫొటోల‌లో విక్ట‌రీ వెంక‌టేష్ ఉబ‌ర్ కూల్ స్టైలిష్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌లో నెరిసిన గ‌డ్డంతో స్టైలిష్ డ్రెస్‌కి త‌గ్గ‌ట్టు బ్లాక్ గాగుల్స్ ధ‌రించి వెంక‌టేష్ క‌నిపిస్తున్న ఫొటోస్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

- Advertisement -

ఇదిలా వుంటే విక్ట‌రీ వెంక‌టేష్ న‌టిస్తున్న `నార‌ప్ప‌` మూవీ నుంచి ఈ రోజు రాత్రి 8 గంట‌ల‌కు టీజ‌ర్ ని రిలీజ్ చేయ‌బోతున్నారు. శ్రీ‌కాంత్ అడ్డాల తెర‌కెక్కిస్తున్న ఈ మూవీ త‌మిళ హిట్ చిత్రం `అసుర‌న్‌` ఆధారంగా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ప్రియ‌మ‌ణి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఇప్ప‌టికే అంచ‌నాల్ని పెంచేసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All