నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకుంటున్నాం అన్న దగ్గరనుండి చాలా వార్తలు వస్తూనే ఉన్నాయి . అందులో కరెక్ట్ ఏంటి? రాంగ్ ఏంటి? వాల్లిద్దరికి మాత్రమే తెలుసు.
అయితే నాగ చైతన్య నుండి విడాకుల తర్వాత సమంత తన సోషల్ మీడియాలో పలు పోస్ట్‌లు పెడుతూ వస్తుంది. వాటికి నెటిజన్స్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఇక వెంకటేష్ కూడాఈ మధ్య రిలేషన్, నమ్మకం, ప్రేమ వంటి విషయాలపై ఏదో ఒక రకంగా నిత్యం కొటేషన్స్‌ను షేర్ చేస్తున్నారు.
తాజాగా వెంకటేష్ చేసిన ఒక పోస్ట్ వైరల్‌గా మారింది. ఇది సమంతను ఉద్దేశించి పెట్టాడా అనే అనుమానం అందరిలో కలుగుతుంది. పోస్ట్‌లో నిన్ను ఇష్టపడిన వాళ్లను ఎప్పుడూ మిస్ యూస్ చేయకు. నిన్ను కావాలనుకుంటున్న వాళ్లకు బిజీగా ఉన్నానని చెప్పకు. ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్ముతారో వాళ్లను ఎప్పుడూ మోసం చేయవద్దు. నిన్ను ఎప్పుడూ గుర్తుపెట్టుకునే వాళ్లని మర్చిపోవద్దు’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్నారు.
ఇదిలా ఉంటే అక్కినేని కుటుంబం నుంచి బయటికి వచ్చిన మాజీ కోడలు సమంత నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత తన పనులతో బిజీ అయిపోయింది. స్నేహితురాలు శిల్పా రెడ్డితో కలిసి దేశమంతా తీర్థయాత్రలకు వెళ్లొస్తుంది. మరోవైపు మూడు నాలుగు సినిమాలు చేస్తుంది సమంత.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా కొన్ని రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని చూస్తుంది సమంత. తెలుగులో శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసిన సమంత.. తమిళంలో విజయ్ సేతుపతి సినిమాలో నటిస్తుంది. దాంతో పాటు మరో రెండు సినిమాలకు కూడా ఓకే చెప్పింది ఈమె.
ఆ మధ్య సమంత మనసు పెయింటింగ్ వేయలేదని చెబితే.. అప్పుడే మనం పెయింటింగ్ వేయాలని సమంత రాసుకొచ్చింది. అలా చేయడం వల్ల మన లోపల ఉన్న మాటలు ఆగిపోతాయని తెలిపింది సమంత. ఈ పెయింటింగ్ గురించి కూడా నెటిజన్లు కామెంట్స్ బాగానే చేసారు. వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత కూడా “ఇక స్వేచ్ఛగా పెయింటింగ్ వేసుకో అని కామెంట్ చేసింది”
కానీ తన ఫాన్స్ మాత్రం ఏమి పూర్తిగా తెలియకుండా ప్రతీ పోస్ట్ సమంత కి లింక్ చేస్తున్నారు అని సీరియస్ అవుంటున్నారు.
ఇవన్నీ ఉన్నా సమంత కి మంచి హృదయం ఉందని తన ఫాన్స్ అంటున్నారు.