Homeగాసిప్స్దిల్ రాజు రూట్లోనే వెళుతున్న సురేష్ బాబు

దిల్ రాజు రూట్లోనే వెళుతున్న సురేష్ బాబు

దిల్ రాజు రూట్లోనే వెళుతున్న సురేష్ బాబు
దిల్ రాజు రూట్లోనే వెళుతున్న సురేష్ బాబు

తమిళ్ సూపర్ హిట్ అసురన్ రీమేక్ ను తెలుగులో రీమేక్ చేయనున్న విషయం తెల్సిందే. ధనుష్ నటించిన అసురన్ రీమేక్ పై చాలా చర్చ జరిగింది. ఈ సినిమా తమిళ్ లో వచ్చిన క్లాసిక్స్ లో ఒకటని చాలా మంది అభిప్రాయపడ్డారు. సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ అయింది. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో సంచలనం సృష్టించింది. దీంతో సహజంగానే ఈ చిత్ర రీమేక్ గురించి ఆరాలు మొదలయ్యాయి. అయితే అందరికంటే ముందు సురేష్ బాబు ఈ చిత్ర రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్నాడు. తమిళ నిర్మాత కలైపులి థానుతో కలిసి ఈ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా రీమేక్ చేయబోతున్నట్లు సురేష్ బాబు ప్రకటించాడు. అయితే ఆ ప్రకటన వచ్చిన వెంటనే టాలీవుడ్ లో చాలానే చర్చలు జరిగాయి. అసలు ఈ కథ తెలుగు వాళ్ళ అభిరుచికి సరిపోతుందా, వెంకటేష్ కు ఈ కథ నప్పుతుందా, ఇంత వయోలెన్స్ ను తెలుగు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా అంటూ రకరకాల ఊహాగానాలు వినిపించాయి.

ఇక్కడ విచిత్రమేమిటంటే వీటన్నిటికీ సమాధానాలు దొరకాలంటే మరో ప్రశ్నకు సమాధానం దొరకాలి. అదే ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసే గట్స్ ఉన్న దర్శకుడెవరు? అసురన్ రీమేక్ ను డైరెక్ట్ చేయడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ రా నెస్, ఇంటెన్సిటీ ఇవన్నీ కనెక్ట్ చేస్తూ థ్రిల్లర్ తరహాలో తెరకెక్కించాలి. సురేష్ బాబు అనుకున్న దానికంటే ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. ఎంతమంది దర్శకుల పేర్లు కన్సిడర్ చేసినా ఆ కాన్ఫిడెన్స్ రావట్లేదు. రొమాంటిక్ చిత్రాలు ఎక్కువగా తీసే హను రాఘవపూడిపై ఈ బాధ్యతలు పెట్టినట్లు వార్తలు వచ్చాయి కానీ అవి ఒట్టి పుకార్లేనని తేలిపోయింది. ఈ సినిమాకు హను రాఘవపూడిని కన్సిడర్ చేసారని, అయితే సంప్రదింపులు కూడా జరగలేదని తెలుస్తోంది.

- Advertisement -

ఈ నేపథ్యంలో సురేష్ బాబు దిల్ రాజు ఫాలో అయిన రూట్లోనే వెళ్లాలని డిసైడ్ అయ్యాడట. కొన్ని నెలల క్రితం దిల్ రాజు 96 చిత్ర రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేసాడు. తమిళంలో మంచి పేరు తెచ్చుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో ఫీల్ పాడవకుండా తెరకెక్కించగల దర్శకుడు ఎవరా అని దిల్ రాజు చాలానే వెతికాడు. అయితే రిస్క్ అనుకున్నాడో ఏమో, వెంటనే ఒరిజినల్ ను తెరకెక్కించిన సి ప్రేమ్ కుమార్ చేతికే దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడు. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రంపై దిల్ రాజు పూర్తి కాన్ఫిడెంట్ తో ఉన్నాడట. సో, సురేష్ బాబు కూడా ఇదే తరహాలో ఒరిజినల్ అసురన్ ను తెరకెక్కించిన వెట్రిమారన్ చేత తెలుగులో కూడా డైరెక్ట్ చేయించాలని చూస్తున్నాడు. సినిమా అంత బాగా తీసినా కూడా ఇంకా బాగా తీయొచ్చని ఫైనల్ ఔట్పుట్ విషయంలో తానింకా సంతృప్తిగా లేనని వెట్రిమారన్ ఆ మధ్య చెప్పాడు. మరో అవకాశం ఇచ్చి, ఈసారి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తే చేయడానికి ఒప్పుకుంటాడేమో అన్న తరహాలో సురేష్ బాబు ఆలోచిస్తున్నాడట.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All