Homeటాప్ స్టోరీస్సీనియ‌ర్ న‌టి జ‌యంతికి ఏమైంది?

సీనియ‌ర్ న‌టి జ‌యంతికి ఏమైంది?

సీనియ‌ర్ న‌టి జ‌యంతికి ఏమైంది?
సీనియ‌ర్ న‌టి జ‌యంతికి ఏమైంది?

ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టి జ‌యంతి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీంతో ఆందోళ‌న‌కు గురైన ఆమె కుటుంబ స‌భ్యులు హుటా హుటిన ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆమె వెంటిలేట‌ర్‌పై వున్న‌ట్టు స‌మాచారం.శ్వాస కోస స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న ఆమెను మంగ‌ళ‌వారం కుటుంబ స‌భ్యులు ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు.

గ‌త 35 ఏళ్లుగా న‌టి జ‌యంతి ఆస్త‌మాతో బాధ‌ప‌డుతున్న‌ట్టు ఆమె స‌న్నిహితులు వెల్ల‌డించారు. జ‌యంతిని ప‌రీక్షించిన డాక్ట‌ర్లు ప్ర‌స్తుతం ఆమెకు వెంటిలేట‌ర్ పై చికిత్స అందిస్తున్నామ‌ని, ఆమె ఆరోగ్య ప‌రిస్థితిని 24గంట‌ల పాటు ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్టు తెలిపారు. న‌టి జ‌యంతి 1945లో బ‌ళ్లారిలో జ‌న్మించారు. తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితురాలైన ఆమె తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డ, మ‌ల‌యాళ‌, హిందీ, మ‌రాఠీ భాషల్లో500ల‌కు పైగా చిత్రాల్లో న‌టించారు.

- Advertisement -

తెలుగులో హీరోయిన్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. `పెద‌రాయుడు` చిత్రంలో సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌కు చెల్లెలుగా, మోహ‌న్‌బాబుకు అత్త‌గా న‌టించి మెప్పించారు. 1950వ ద‌శ‌కం నుంచి ఆమె ఇండ‌స్ట్రీలో వున్నారు. క‌ర్ణాట‌క స్టేట్ ఫిల్మ్ అవార్డులు, ఉత్త‌మ న‌టి, ఉత్త‌మ స‌హాయ న‌టిగా ప్రెసిడెంట్ మెడ‌ల్‌, రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డుల్ని ఆమె అందుకున్నారు. క‌న్న‌డ చిత్ర సీమ `అభిన‌య శార‌ద‌` అనే బిరుదుతో జ‌యంతిని స‌త్క‌రించింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All