Homeగాసిప్స్దిల్ రాజు క్యాంప్ కు వేణు శ్రీరామ్ బై చెప్పేసాడా?

దిల్ రాజు క్యాంప్ కు వేణు శ్రీరామ్ బై చెప్పేసాడా?

దిల్ రాజు క్యాంప్ కు వేణు శ్రీరామ్ బై చెప్పేసాడా?
దిల్ రాజు క్యాంప్ కు వేణు శ్రీరామ్ బై చెప్పేసాడా?

అగ్ర నిర్మాతగా దిల్ రాజు కొనసాగుతున్నాడంటే తనకు కథల మీద ఉన్న నమ్మకమే.  ముఖ్యంగా దర్శకులను బాగా నమ్ముతాడు దిల్ రాజు. తన ద్వారా పరిచయమైన దర్శకులకు మళ్ళీ తన వద్దే పనిచేసేలా అవకాశాలు ఇస్తుంటాడు. అలాగే వేణు శ్రీరామ్ దిల్ రాజు క్యాంప్ లోనే ఎదిగాడు.

ఆర్య, బొమ్మరిల్లు వంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన వేణు శ్రీరామ్ ఓ మై ఫ్రెండ్ చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందివ్వకపోయినా దిల్ రాజు మాత్రం వేణుని తన వద్దే ఉంచుకున్నాడు. వేరే సినిమాల కథలకు పనిచేసాడు.

- Advertisement -

గ్యాప్ తీసుకుని ఎంసీఏ చిత్రాన్ని వేణు దర్శకత్వంలో నిర్మించాడు దిల్ రాజు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా ఐకాన్ ప్రాజెక్ట్ ను సెట్ చేసాడు. వివిధ కారణాల వల్ల ఆప్రాజెక్ట్ ఆలస్యమైంది. మళ్ళీ ఈలోగానే దిల్ రాజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పనిచేసే అవకాశాన్ని కల్పించాడు. వకీల్ సాబ్ మంచి విజయం సాధించింది.

వేణు శ్రీరామ్ కు కూడా దర్శకుడిగా మంచి పేరే వచ్చింది. దీంతో బయట నిర్మాణ సంస్థల నుండి అదిరిపోయే ఆఫర్లు వస్తున్నయని, అందుకే దిల్ రాజు కాంపౌండ్ నుండి వేణు బయటకు వచ్చినట్లు రూమర్లు ఉన్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All