
ఎన్నో వందలాది సినిమాల్లో తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించిన హాస్య నటుడు వేణు మాధవ్, తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గత కొంత కాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న వేణుమాధవ్, ఇప్పుడు సమస్య తీవ్రతరం కావడంతో సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు.
ప్రస్తుతం వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్ పై ఉంచి వైద్యం అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. 1996లో సంప్రదాయం అనే చిత్రంతో తన సినీ ప్రస్థానాన్ని ఆరంభించిన వేణు మాధవ్, అంచెలంచలుగా ఎదిగి బిజీ కమెడియన్ గా బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం వంటి వారికి గట్టి పోటీనిచ్చారు.
గత కొన్నేళ్లుగా వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. అవి అదుపుతప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. దానిపై వేణుమాధవ్ సీరియస్ అయ్యి కేసు పెట్టేదాకా పరిస్థితి వెళ్ళింది. ఏదేమైనా వేణుమాధవ్ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.