Homeటాప్ స్టోరీస్హాస్య కథానాయకులు చేసేది హాస్యం మాత్రమే కాదు....వారు ఆదర్శంగా కూడా ఉంటారు.

హాస్య కథానాయకులు చేసేది హాస్యం మాత్రమే కాదు….వారు ఆదర్శంగా కూడా ఉంటారు.

హాస్య కథానాయకులు చేసేది హాస్యం మాత్రమే కాదు....వారు ఆదర్శంగా కూడా ఉంటారు.
హాస్య కథానాయకులు చేసేది హాస్యం మాత్రమే కాదు….వారు ఆదర్శంగా కూడా ఉంటారు.

మనకి సినిమా రంగం అంటే 26 పరిశ్రమలు ఉన్నాయి. ఆ 26 పరిశ్రమలో హాస్య కథానాయకులు చాలా ముఖ్యం. వారు లేనిది సినిమా ఆడుతుందా అంటే కష్టమే అని చెప్పాలి ఈ రోజుల్లో. అలాంటి హాస్య కథానాయకులు మన తెలుగు పరిశ్రమ గురించి మాట్లాడుకునేలా చేస్తున్నారు….వారి స్నేహం మరియు ఐక్యమత్యం గురించి ఆదర్శంగా తీసుకోవాలి అని అనుకుంటున్నారు.

కేవలం హాస్యం మాత్రమే చేయడం వాళ్ళకి అంతగా ఇష్టం లేదు. ఎదో వారి తరపునా సినిమాని నిలబెట్టాలి అని వారు డిసైడ్ అయ్యి దర్శకుడి మాట అనుసరిస్తారు. పాత్ర ఏదైనా సరే వారు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అలాంటిది ఇప్పుడు వారే ఒక యూనిటీగా వారం వారం ఎదో ఒక మీటింగ్ లో కలుస్తూ ఉంటున్నారు. ఈ ఐక్యమత్యం కి గల కారణం మాత్రం ‘వెన్నెల కిషోర్’ గారు అని తెలిసిపోతుంది.

- Advertisement -

‘ఫ్లైయింగ్ కలర్స్’ పేరుతో హాస్య కథానాయకులని ఒక ఐక్యమత్యంలో పెట్టేసి వారికి సమయం దొరికినప్పుడల్లా కలవాలి అని వారికి చెప్పేవారంటా. అంతేనా అంటే ఇంకా ఉంది….కలవటం అంటే ఊరికే అలా కలవటం కాదు మన అందరికి ఒక డ్రెస్ కోడ్ ఉండాలి, అలా ఉంటేనే మన మీటింగ్ కి ఒక అర్ధం అని వారు డిసైడ్ అయిపోయారు. శ్రీనివాస్ రెడ్డి ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ సినిమాలో కూడా ఈ హాస్య కథనాయకులు అందరు కనిపించబోతున్నారు.

ఈ యూనిటీ లో భాగ్యం అయిన వారు ఎవరంటే వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, ధన్ రాజ్, సత్య, నల్ల వేణు, సత్యం రాజేష్, చిత్రం శీను, ప్రవీణ్, సప్తగిరి, రోలర్ రఘు, నవీన్ నేని, ఇంకా మిగిలిన జబర్దస్త్ హాస్య కథానాయకులు కూడా జతకట్టారు వీరి యూనిటీలో. ఇదంతా చూస్తుంటే మన తెలుగు పరిశ్రమలో మంచి పరిణామం అని చెప్పవచ్చు

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All