Homeటాప్ స్టోరీస్వెంకీ మామ విడుదల తేదీని ధృవీకరించిన సురేష్ బాబు

వెంకీ మామ విడుదల తేదీని ధృవీకరించిన సురేష్ బాబు

వెంకీ మామ విడుదల తేదీని ధృవీకరించిన సురేష్ బాబు
వెంకీ మామ విడుదల తేదీని ధృవీకరించిన సురేష్ బాబు

అక్కినేని నాగ చైతన్య, విక్టరీ వెంకటేష్ తొలిసారి పూర్తిస్థాయిలో కలిసి నటిస్తున్న సినిమా వెంకీ మామ. నిజ జీవితంలో మామ, అల్లుళ్ళు అయిన వెంకటేష్, నాగ చైతన్య ఈ సినిమాలో కూడా అవే పాత్రలు పోషిస్తుండడం విశేషం. ఈ చిత్రంలో హీరోయిన్లుగా రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నారు. నిజానికి వెంకీ మామ షూటింగ్ ఎప్పుడో మొదలైంది. అసలు దసరాకే విడుదల చేద్దామనుకున్నారు. దసరాకి సైరా వస్తున్నా కానీ పోటీగా మరో సినిమా ఉండొచ్చని, కొంచెం గ్యాప్ తీసుకుని రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ వెంకీ మామ షూటింగ్ లో వెంకటేష్ కాలికి గాయం కావడంతో మొత్తం షెడ్యూల్స్ లో తేడా వచ్చేసింది. దీంతో దసరాకి రిలీజ్ చేయడం అసాధ్యమని తేలిపోయింది. దసరా తర్వాత దీపావళి ఉన్నా అప్పటికి విడుదల చేయాలనుకున్నా కూడా కష్టమే. ఎందుకంటే నవంబర్ కి కానీ సినిమా సిద్ధమవ్వదు.

కానీ నవంబర్ లో రిలీజ్ చేయాలంటే అది ఆఫ్ సీజన్. ఈ నెలలో థియేటర్లు సాధారణంగా వెలవెలబోతుంటాయి. మళ్ళీ క్రిస్మస్ వీకెండ్ వస్తే కానీ సందడి మొదలవ్వదు. అయితే వెంకీ మామను క్రిస్మస్ కు కాకుండా పెద్ద పండక్కి విడుదల చేయాలని భావించారు. కానీ సంక్రాంతికి అప్పటికే నాలుగు సినిమాలు కర్చీఫ్ వేసుకుని రెడీగా ఉన్నాయి. పోనీ క్రిస్మస్ కు వెళదామంటే అక్కడ కూడా నందమూరి బాలకృష్ణ రూలర్, సాయి ధరమ్ తేజ్ ప్రతిరోజూ పండగే సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు చిత్రాలూ ఒకే రోజున అంటే డిసెంబర్ 20నే విడుదలవుతున్నాయి. ఇప్పటికే రెండు సినిమాలు విడుదలవుతున్నాయి కాబట్టి మూడో సినిమాకు స్కోప్ లేదు. ఇప్పుడు చిత్ర నిర్మాత సురేష్ బాబు ముందు ఉన్నవి రెండే దారులు. ఒకటి ఫిబ్రవరికి సినిమా విడుదలను వాయిదా వేసుకోవడం, లేదంటే డిసెంబర్ మొదట్లో సినిమాను విడుదల చేయడం. చాలా కాలం ఆలోచించిన తర్వాత సురేష్ బాబు డిసెంబర్ రిలీజ్ కే ఓటు వేసినట్లు తెలుస్తోంది.

- Advertisement -

అయితే డిసెంబర్ లో ఏ వారం విడుదల చేయాలి అన్నది మరో ప్రశ్న? అయితే డిసెంబర్ 13న విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు ఉంది. వెంకటేష్ పుట్టినరోజు నాడు వెంకటేష్ సినిమా రిలీజ్ అవుతోందంటే అంతకుమించిన ప్రచారం ఏముంటుంది? పైగా ఇప్పటిదాకా 73 సినిమాలు చేసినా కానీ ఒక్క సినిమా కూడా డిసెంబర్ 13న విడుదలవ్వలేదు. సైరా తర్వాత వచ్చే మరో పెద్ద సినిమాగా కూడా వెంకీ మామ గుర్తింపు తెచ్చుకుంటుంది. ఈ కారణాలు అన్నీ చూసుకుని డిసెంబర్ 13నే వెంకీ మామను విడుదల చేస్తామని సురేష్ బాబు ప్రకటించారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో బిజీగా ఉంది. ఈ సినిమాను బాబీ తెరకెక్కిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈరోజు సాయంత్రం ఈ చిత్రంలోని రెండో పాట ఎన్నేళ్లకో విడుదల కానుంది. మరి ఇది ఎలాంటి రెస్పాన్స్ తెచుకుంటుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All