Homeటాప్ స్టోరీస్నిర్మాతలు కచ్చితమైన తేదీ చెబితేనే బాగుంటుంది.

నిర్మాతలు కచ్చితమైన తేదీ చెబితేనే బాగుంటుంది.

నిర్మాతలు కచ్చితమైన తేదీ చెబితేనే బాగుంటుంది.
నిర్మాతలు కచ్చితమైన తేదీ చెబితేనే బాగుంటుంది.

ఒక తెలుగు సినిమా రాబోయే 10 సినిమాలని భయపెడుతుంది. మీరు ఎందుకు అలా చేస్తున్నారు? నిర్మాతలు అయిన మీరు ఒక కరెక్ట్ డేట్ చెప్పండి. వరుసలో మా సినిమా కూడా ఉంది అని ఆ రాబోయే 10 సినిమాల నిర్మాతలు తలపెట్టుకొని బెంబేలెత్తిపోతున్నారు. చూస్కుంటే ఆ సినిమా అప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుంది అని వస్తున్న వార్తలు చూసి కూడా సినిమా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

విక్టరీ వెంకటేష్ – నాగ చైతన్య ఇద్దరు మేనమామ – అల్లుడు లాగ జంటగా నటించిన సినిమా ‘వెంకీ మామ’ రిలీజ్ డేట్ ఇంకా నోచుకోలేదు. సినిమా యూనిట్ వాళ్ళు రిలీజ్ డేట్ కరెక్ట్ గా చెప్పలేకపోతున్నారు. సినిమా నిర్మాత ‘సురేష్ బాబు’ గారు ప్రస్తుతం చెన్నై లో ఉన్నారు. వెంకీ మామ యూనిట్ వాళ్ళు ఏమో మీడియా వారికి, అలాగే కొంతమంది పి.ఆర్.ఓ లకి సినిమా డిసెంబర్ రెండవ వారం లో రిలీజ్ అని చెప్పేసారు. అలా చెప్పేసరికి డిసెంబర్ రెండవ వారం లో విడుదల అవుతున్న కొన్ని చిన్న సినిమాలు భయపడుతున్నాయి.

- Advertisement -

అలాగే ఇంకా కొంతమంది ప్రచారం చేసిన రిలీజ్ డేట్ 2020 సంక్రాంతి సందర్భంగా జనవరి 11 అని అన్నారు. ఇక అంతే ఒక్కసారిగా వెంకీ మామ సినిమా చేస్తున్న హడావిడికి దాదాపు 10 సినిమాలు వాటి రిలీజ్ డేట్ నోచుకోకుండా అనుకున్న డేట్ కి వెంకీ మామ తో పోటీ పడలేక సతమతమవుతున్నారు. ఇక నిర్మాత సురేష్ బాబు గారు దిగి వచ్చి కచ్చితమైన రిలీజ్ డేట్ చెప్పేదాకా తమకి నిద్ర పట్టదు అని అంటున్నారు ఆ నిర్మాతలు.

మరి 10 సినిమాల విషాయానికి వస్తే అందులో పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. ఇద్దరిలోకం ఒక్కటే, ప్రతి రోజు పండగే, డిస్కో రాజా, జార్జ్ రెడ్డి, పలాస 1978, కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఈ ఆరు సినిమాలు డిసెంబర్ లో ఉండగా జనవరి లో సరిలేరు నీకెవ్వరూ, అలా వైకుంఠపురములో, ఎంతమంచి వాడవురా మరియు దర్బార్ లాంటి 4 సినిమాలు ఉన్నాయి. మొత్తానికి 10 సినిమాలని భయపెడుతున్న వెంకీ మామ విషయంలో తొందరలోనే ఎదో ఒక చర్చ జరగాలి అని అందరు అనుకుంటున్నారు.

ఇలా ముందుకి, వెనకకి వెళుతున్న ఆ సినిమా రిలీజ్ డేట్ చెప్పకపోతే జనాలకి ఆ సినిమా మీద ఆసక్తి పోయి పూర్తిగా నిరాశ చెందుతారు అని అంటున్నారు సినిమా విశ్లేషకులు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All