Homeటాప్ స్టోరీస్వెంకీ మామ తొలి వీక్ కలెక్షన్స్: సాధించాల్సింది చాలా ఉంది

వెంకీ మామ తొలి వీక్ కలెక్షన్స్: సాధించాల్సింది చాలా ఉంది

వెంకీ మామ తొలి వీక్ కలెక్షన్స్: సాధించాల్సింది చాలా ఉంది
వెంకీ మామ తొలి వీక్ కలెక్షన్స్: సాధించాల్సింది చాలా ఉంది

బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాలేవీ లేని సమయంలో విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య హీరోలుగా నటించిన వెంకీ మామ విడుదలైంది. జనాలు లేక వెలవెలబోతున్న థియేటర్లకు కొత్త కళను తీసుకొచ్చింది. వెంకీ మామ చిత్రానికి నిజానికి టాక్ చాలా యావరేజ్ గా వచ్చింది. అయితే చాలా కాలం తర్వాత ఒక పెద్ద సినిమా రావడంతో జనాలు థియేటర్లకు క్యూ కట్టారు. అందుకే ఈ చిత్రం తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 7.22 కోట్ల భారీ ఓపెనింగ్ తెచ్చుకుంది. ఇద్దరు హీరోల కెరీర్స్ లోనూ ఇదే అత్యధికం. ఇక తొలి వీకెండ్ లో కూడా వెంకీ మామ అదరగొట్టింది. మొదటి రోజు 7 కోట్ల పైచిలుకు ఓట్లు వచ్చాక మిగతా రెండు రోజులకు కలిపి మరో 11 కోట్లు వచ్చాయి. ఇదే ఫ్లో కంటిన్యూ అయి ఉంటే బాగుండేది కానీ వెంకీ మామ వీక్ డేస్ లో డల్ అయిపోయింది. సోమవారం నుండీ ఈ చిత్ర కలెక్షన్స్ స్థాయి పడిపోతూ వస్తోంది.

మొత్తంగా తొలి వారం ముగిసేసరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి వెంకీ మామ 22 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇది మంచి మొత్తమే అయినా కూడా ఈ చిత్రాన్ని భారీ రేట్లకు అమ్మిన కారణంగా ఇంకా హిట్ స్టేటస్ ఇవ్వలేం. ఈ చిత్రం ఏపీ, నైజాంలో కలిపి 31 కోట్లకు బిజినెస్ చేసింది. అంటే మరో 9 కోట్లు వస్తే కానీ ఈ చిత్రాన్ని హిట్ గా పరిగణించలేం. సో రెండో వీకెండ్ వెంకీ మామకు చాలా కీలకం. అయితే ఈ వీకెండ్ నాలుగు చిత్రాలు విడుదలయ్యాయి.

- Advertisement -

ప్రతిరోజూ పండగే, రూలర్, దొంగ, దబాంగ్ 3 చిత్రాలతో వెంకీ మామ పోటీ పడుతోంది. మరి ఈ పోటీ తట్టుకుని వెంకీ మామ నిలబడగలదా? లేదంటే మాత్రం ఈ చిత్రాన్ని ప్లాప్ కేటగిరీలో వేయాల్సి వస్తుంది. బాబీ తెరకెక్కించిన వెంకీ మామ చిత్రాన్ని సురేష్ బాబు నిర్మించాడు. థమన్ సంగీత దర్శకుడు. ఈరోజు విడుదలైన నాలుగు చిత్రాల ఫేట్ బట్టి వెంకీ మామ ఫేట్ ఆధారపడి ఉందన్న మాట.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All