Homeటాప్ స్టోరీస్డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కానున్న వెంకటేష్ నారప్ప

డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కానున్న వెంకటేష్ నారప్ప

డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కానున్న వెంకటేష్ నారప్ప
డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కానున్న వెంకటేష్ నారప్ప

విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ సినిమా నారప్ప. ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన అసురన్ కు రీమేక్ గా తెరకెక్కింది. కలైపులి ఎస్ థాను, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ముందు ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేయాలనుకున్నారు. ప్రస్తుతం థియేటర్లు తీర్చుకోవడానికి అనుమతులు కూడా వచ్చాయి.

కానీ కరోనా థర్డ్ వేవ్ వస్తుందని, ఇప్పటికే డెల్టా ప్లస్ వేరియంట్ విజృంభిస్తోందని వస్తున్న వార్తల నేపథ్యంలో థియేట్రికల్ బిజినెస్ పై నిర్మాతలకు ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఈ క్రమంలో కొంత మంది నిర్మాతలు డిజిటల్ రిలీజ్ లపై ఆసక్తి చూపిస్తున్నారు.

- Advertisement -

తాజా సమాచారం ప్రకారం వెంకటేష్ నటించిన నారప్ప చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయనున్నారు. జులై 24 నుండి నారప్ప స్ట్రీమ్ అవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే వెంకటేష్ దృశ్యం 2 చిత్రాన్ని అమెజాన్ లో విడుదల చేయడానికి డీల్ క్లోజ్ అయింది. సో వెంకటేష్ నటించిన రెండు చిత్రాలు కూడా ఓటిటి బాట పట్టాయన్నమాట.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All