
విక్టరీ వెంకటేష్ నటించిన దృశ్యం సీక్వల్ దృశ్యం 2 చాలా కాలం క్రితమే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన సూపర్ హిట్ చిత్రం దృశ్యం 2ను అదే పేరుతో రీమేక్ చేసారు. ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ తెలుగు వెర్షన్ ను డైరెక్ట్ చేసాడు. నదియా, మీనా, ఎస్తేర్ అనిల్, నరేష్ ఈ సీక్వెల్ లో కూడా భాగం పంచుకున్నారు. సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించాడు.
ఈ సినిమాను మొదట డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల చేస్తారని, దానికి సంబంధించిన డీల్స్ పూర్తయ్యాయని వార్తలు వచ్చాయి. కానీ కొన్ని నెలలకు మళ్ళీ థియేటర్లు తెరుచుకోవడంతో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తారని అన్నారు. ప్రస్తుతం తాజా సమాచారం ప్రకారం దృశ్యం2 ఓటిటి మాధ్యమంలోనే విడుదల కానుంది. అయితే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో కాకుండా అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రం విడుదలవుతుందని సమాచారం. ఈరోజో రేపో దీనికి సంబంధించిన అప్డేట్ వస్తుంది.
మోహన్ లాల్ నటించిన దృశ్యం 2 కూడా అమెజాన్ ప్రైమ్ లోనే అందుబాటులో ఉంది.
ఇవి కూడా చదవండి:
మళ్ళీ ఓటిటి రిలీజ్ రూమర్స్ తో దృశ్యం 2
సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న దృశ్యం 2
దృశ్యం 2 ప్లాన్స్ మళ్ళీ మారాయిగా!
దృశ్యం 2 డిజిటల్ రిలీజ్ హింట్ ఇచ్చిన వెంకీ మామ