
మోహన్‌లాల్, మీనా కీలక పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం `దృశ్యం 2`. ఓటీటీలో విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని తెలుగు రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. విక్టరీ వెంకటేష్, మీనా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ని రికార్డు స్థాయిలో కేవలం 47 రోజుల్లోనే పూర్తి చేశారు. ప్రస్తుతం కొన్ని ప్యాచ్ వర్క్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయి.
ఇదిలా వుంటే ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం మూవీ సర్కిల్స్ లో హల్‌చల్ చేస్తోంది. ఇంఆక పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కానీ ఈ చిత్రాన్ని కూడా ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మోహన్‌లాల్ నటించిన మలయాళ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు.
అదే తరహాలో తెలుగులో రీమేక్ అవుతున్న ` దృశ్యం 2 `ని కూడా ఓటీటీలోనే రిలీజ్ చేయబోతున్నారట. సెకండ్ వేవ్ కారణంగానే మేకర్స్ తాజా నిర్ణయం తీసుకున్నారని అంతా అంటున్నారు. అయితే ఈ పుకార్లపై నిర్మాత సురేష్‌బాబు స్పందించారు. `ఓటీటీ విడుదల పుకార్లలో నిజం లేదు. పూర్తి సామర్థ్యంతో థియేటర్లు నడిచినప్పుడే మేము మా చిత్రాన్ని విడుదల చేస్తాము. థియేటర్లు రిలీజ్ అయిన తర్వాతే మా సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుంది` అని స్పష్టం చేశారు. జీతు జోసెఫ్ తెలుగు రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు.