Homeటాప్ స్టోరీస్'వెంకీ మామ' లుక్ అదిరింది!!

‘వెంకీ మామ’ లుక్ అదిరింది!!

Venkatesh
Venkatesh

విక్టరీ వెంకటేష్, యూవ సామ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్ లో దర్శకుడు కె.ఎస్. రవీంద్ర (బాబీ) రూపొందిస్తున్నచిత్రం “వెంకీ మామ”. ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి. యప్-2 చిత్రం బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ నటిస్తోన్న చిత్రం ఇది. ఆగస్టు 15 న ఈ చిత్ర టీజర్ ని విడుదల చేయనున్నారు. దర్శకుడు బాబీ విలెజ్ బ్యాక్ డ్రాప్ లో పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలోని వెంకీ లుక్ ఒకటి రిలీజ్ అయింది. జై లవ కుశ తర్వాత బాబీ ఈ చిత్రాన్ని ప్రేస్టీజియస్ గా రూపొందిస్తున్నాడు.

ఆర్మీ గ్రీన్ బులెట్ పై కూర్చొని మీసం మెలితిప్పుతున్న వెంకీ మాస్ లుక్ ఆసక్తికరంగా ఉంది. ఆ ఫొటోలో చుట్టూ పొలాల మధ్య వెంకటేష్ ని చూస్తుంటే కోనసీమ బులెట్ బాబులా వెంకీ ఈ చిత్రంలో ఇరగదీస్తాడనిపిస్తుంది. నాగచైతన్య ఫస్ట్ టైం తన మావయ్య వెంకటేష్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.. వీళ్లిద్దరి కాంబినేషన్ లో చిత్రీకరించిన సీన్స్ ఆసక్తి కరంగా వచ్చాయని చిత్ర యూనిట్ లో టాక్ వినిపిస్తోంది.

- Advertisement -

సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తుండగా ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. అక్టోబర్ లో దసరా కానుకగా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది!!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All