విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది మరో హిట్ అందుకున్నట్లే. ఏడాది మొదట్లో ఎఫ్ 2 తో తన కెరీర్ లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకటేష్, ఏడాది చివర్లో వెంకీ మామగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరినీ అలరించాడు. ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ ఓపెనింగ్స్ రావడానికి ప్రధాన కారణం వెంకటేష్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. వెంకీ మామ తొలి వీకెండ్ అదిరిపోయింది. తొలి వీక్ వరకూ కూడా ఎటువంటి ఢోకా లేదు. వీక్ డేస్ లో వసూళ్లు కొంత నెమ్మదించినా ఇంకా చెప్పుకోదగ్గ థియేటర్లలోనే వెంకీ మామ ఆడుతోంది. ఈరోజుతో వెంకీ మామకు ఉన్న అడ్వాంటేజ్ పూర్తవుతుంది. రేపు ఏకంగా నాలుగు సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి. ఈ చిత్రాల పోటీని తట్టుకుని వెంకీ మామ ఎంతవరకూ నిలబడతాడో చూడాలి.
వెంకీ మామ భారీ రేట్ల కారణంగా ప్లాప్ అవ్వొచ్చు లేదా సెకండ్ వీక్ లో కూడా నిలబడి హిట్ అవ్వొచ్చు. ఏదేమైనా వెంకటేష్ ఇమేజ్ కు ఈ చిత్రం మేలు చేసిందనే చెప్పాలి. వెంకీ రేంజ్ ను అందరికీ చాటి చెప్పిన చిత్రమిది. వెంకీ మామ రిలీజ్ తర్వాత కొంత రెస్ట్ తీసుకుంటున్న వెంకటేష్ 2020ను సరికొత్త చిత్రాలతో మొదలుపెట్టనున్నాడు. ఇప్పటికే 2020 డైరీ నింపేసుకున్నాడు వెంకటేష్. వచ్చే ఏడాది పూర్తి చేయాల్సిన సినిమాలను సెట్ చేసుకున్నాడు. ఇక మొదలుపెట్టడమే తరువాయి.
ముందుగా అసురన్ రీమేక్ లో వెంకీ నటించాల్సి ఉంది. రెండు వరస ఫన్ ఎంటెర్టైనెర్స్ తర్వాత ఈసారి పూర్తి సీరియస్ రోల్ లోకి మారిపోనున్నాడు. యాక్షన్, వయొలెన్స్ కలగలిసి ఉన్న పాత్ర ఇది. జనవరిలోనే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశముంది. ఇక ఈ చిత్రం పూర్తవ్వగానే వెంకటేష్ ముందు రెండు ఆప్షన్స్ ఉండనున్నాయి. ఒకటి ఎంటర్టైనింగ్ ఫిలిమ్స్ కు ఈ మధ్య కేరాఫ్ అడ్రస్ గా మారిన త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో వెంకీ నటించాల్సి ఉంది. అలాగే తరుణ్ భాస్కర్ చెప్పిన ఒక రేసింగ్ లైన్ కూడా ఓకే చెప్పి ఉన్నాడు. ఐతే వీటిలో ఏది ముందు, ఏది తర్వాత అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు.
వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కూడా నటించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఇద్దరికీ ఉన్న కమిట్మెంట్స్ దృష్ట్యా ఈ ఇద్దరి ప్రాజెక్ట్ ఇప్పట్లో సెట్ అయ్యేలా కనిపించట్లేదు.