Homeగాసిప్స్స్టార్ డైరెక్టర్ల చూపు మళ్ళీ వెంకీ మామపై?

స్టార్ డైరెక్టర్ల చూపు మళ్ళీ వెంకీ మామపై?

స్టార్ డైరెక్టర్ల చూపు మళ్ళీ వెంకీ మామపై?
స్టార్ డైరెక్టర్ల చూపు మళ్ళీ వెంకీ మామపై?

సీనియర్ హీరోలయ్యాక అదే ఊపుతో, అదే క్రేజ్ తో బండి లాగించడం చాలా కష్టం. హీరోగా చేయడానికి కొన్ని పరిమితులు అడ్డం వస్తాయి. అలాగే ఇండస్ట్రీ టాప్ 4 లో ఒకడిగా పేరు తెచ్చుకున్న వెంకటేష్, ఆ మధ్య బాగా డౌన్ అయిపోయాడు. హీరోగా వరస ఓటములను ఎదుర్కొని మార్కెట్ కూడా డౌన్ అయిపొయింది. అయితే ఈ ఏడాది వెంకటేష్ నటించిన ఎఫ్ 2, వెంకీలోని సత్తాను మరోసారి బయటకు తీసింది. సరైన సినిమా పడితే ఇప్పటికీ వెంకటేష్ ప్రేక్షకులను ఎలా థియేటర్లవైపు పరిగెత్తించగలడో నిరూపించాడు. ఎఫ్ 2 ఏకంగా 80 కోట్ల పైచిలుకు షేర్ రాబట్టగలిగింది అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇక రీసెంట్ గా విడుదలైన వెంకీ మామ విషయంలో కూడా ఇదే జరిగింది. టాక్ తేడా కొట్టినా కానీ ఈ చిత్రానికి ఓపెనింగ్స్ అదిరిపోయాయంటే దానికి వెంకీనే ప్రధాన కారణం.

వెంకీ మామకు ఓపెనింగ్స్ అదిరిపోగా, ఇంకా ఓ మాదిరి కలెక్షన్స్ తో బాగానే ఆడుతోంది. ఇలా ఈ ఏడాది ఒక బ్లాక్ బస్టర్, ఒక హిట్ అందుకున్న వెంకటేష్, ఇప్పుడు అసురన్ రీమేక్ లో నటించేందుకు సిద్ధపడుతున్నాడు. ఇప్పటికీ మంచి కథలతో వెంకీ మ్యాజిక్ చేయగలడని అర్ధమైంది కాబట్టి స్టార్ దర్శకులు మళ్ళీ వెంకటేష్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. వెంకీతో సినిమా అంటే షూటింగ్ ఫాస్ట్ గా అయిపోతుంది, రిస్క్ కూడా తక్కువ. అందుకే వెంకీ మామకు మళ్ళీ డిమాండ్ పెరిగిపోయింది.

- Advertisement -

పరిస్థితులు చూస్తుంటే ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మళ్ళీ వెంకటేష్ తో సినిమా చేసే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. మూడేళ్ళ క్రితం ఈ కాంబోలో సినిమాపై ప్రకటన వచ్చినా కానీ అప్పుడు ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు త్రివిక్రమ్. ప్రస్తుతం అల వైకుంఠపురములో షూటింగ్ లో బిజీగా ఉన్న త్రివిక్రమ్ మళ్ళీ వెంకటేష్ సినిమా గురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే అల వైకుంఠపురములో రిలీజ్ తర్వాత ఈ సినిమానే మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. అలా అయితే వెంకటేష్ 75వ చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలోనే ఉండే అవకాశముంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All