Homeటాప్ స్టోరీస్అసురన్ రీమేక్ కు అడ్డాల ఎందుకో చెప్పేసిన వెంకీ

అసురన్ రీమేక్ కు అడ్డాల ఎందుకో చెప్పేసిన వెంకీ

అసురన్ రీమేక్ కు అడ్డాల ఎందుకో చెప్పేసిన వెంకీ
అసురన్ రీమేక్ కు అడ్డాల ఎందుకో చెప్పేసిన వెంకీ

విక్టరీ వెంకటేష్ అసురన్ రీమేక్ చేస్తానని ప్రకటించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వెంకీకి సాఫ్ట్ ఇమేజ్ ఉంది. ఆయన రఫ్ క్యారెక్టర్ లు చేసినవి చాలా తక్కువ. ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎక్కువ పట్టున్న వెంకీ ఇలా ఇంటెన్స్, రా గా ఉండే అసురన్ రీమేక్ కు ఎలా సరిపోతాడా అని అందరూ అనుకున్నారు. అయితే అంతకంటే పెద్ద షాక్ దర్శకుడి పేరు చెప్పినప్పుడు కలిగింది. సురేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసురన్ రీమేక్ కు శ్రీకాంత్ అడ్డాలను ఎంచుకున్నామని, త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపాడు. శ్రీకాంత్ అడ్డాలకు ఫుల్ క్లాస్ ఇమేజ్ ఉంది. ఆయన సినిమాలు అన్నీ ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చేవే. అసలు ఇప్పటిదాకా తన సినిమాల్లో సరిగ్గా ఒక ఫైట్ కూడా పెట్టని అడ్డాల, అసురన్ లాంటి ఫుల్ గొడవలు, కొట్లాటలు, నరుక్కోవడాలు, రక్తపాతం ఉన్న సినిమాను ఎలా తెరకెక్కిస్తాడు, అందులోని పాయింట్ ను సమర్ధవంతంగా ఎలా చూపిస్తాడు అన్నది ప్రతి ఒక్కరికీ కలిగిన సందేహం.

ఇదే డౌట్ ను ఇటీవలే మీడియాతో ముచ్చటిస్తున్న సందర్భంగా వెంకీని అడిగారు మీడియా మిత్రులు. దానికి వెంకటేష్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల మంచి కసిమీద ఉన్నాడని చెప్పాడు వెంకీ. అడ్డాల కష్టపడే మనస్తత్వం ఉన్న దర్శకుడు. ఇద్దరం ఇప్పటికే ఒక సినిమా చేసాం. మా మధ్య మంచి సమన్వయము ఉంది. అసురన్ రీమేక్ ను బాగా హ్యాండిల్ చేయగలడన్న నమ్మకం మాకుంది. అందుకే అతణ్ణి తీసుకున్నాం. కచ్చితంగా మా నమ్మకాన్ని నిలబెడతాడనే అనుకుంటున్నామని చెప్పాడు వెంకీ.

- Advertisement -

ఇంకా అసురన్ చిత్ర విశేషాలు చెబుతూ ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల కాస్టింగ్ పనులు చూస్తున్నాడని, త్వరలోనే దాన్ని పూర్తి చేసి జనవరి నుండి షూటింగ్ కు వెళదామని అనుకుంటున్నట్లు వెంకీ తెలిపాడు. అలాగే నిరవధికంగా షూటింగ్ ను పూర్తి చేసి వేసవికల్లా సినిమాను విడుదల చేయాలన్నది ప్లాన్ ఆట. మరి వెంకీ – సురేష్ బాబు ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో, శ్రీకాంత్ అడ్డాల ఈ ఇంటెన్స్ చిత్రాన్ని ఎంత ప్రభావవంతంగా రీమేక్ చేయగలడో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All