Homeటాప్ స్టోరీస్మరో ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసిన వెంకీ

మరో ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసిన వెంకీ

Venkatesh new project cancelled
Venkatesh new project cancelled

సీనియర్ హీరో వెంకటేష్ మరో ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇటీవల వెంకటేష్ ఒప్పుకున్నా సినిమాలు సెట్స్ పైకి వచ్చే లోపే క్యాన్సిల్ అవుతున్నాయి. గత ఏడాది తేజ దర్శకత్వంలో ఒక సినిమాని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా స్క్రిప్ట్ విషయంలో విబేధాలు రావడంతో వెంకటేష్ తప్పుకున్నాడు.

ఇక గత కొన్నాళ్లుగా త్రినాథరావు నక్కినతో కూడా వెంకీ ఒక సినిమా చేయనున్నట్లు టాక్ వచ్చింది. దాదాపు స్క్రిప్ట్ రెడి చేసి ఉంచారు. షూటింగ్ మొదలెట్టాలని అనుకున్న సమయంలో నిర్మాత సురేష్ బాబు దర్శకుడితో మాట్లాడి ఇప్పట్లో సినిమా కుదరదని చెప్పడంతో దర్శకుడు కూడా సైలెంట్ గా సైడ్ అయిపోయాడట. ఈ విషయంపై పూర్తుయి వివరాలు తెలియాల్సి ఉంది. చేసేదేమి లేక మరో హీరోను వెతుకున్నట్లు తెలుస్తోంది.
సినిమా చూపిస్త మావ – నేను లోకల్ వంటి బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న త్రినాథ్ రావ్ నక్కిన ఆ విజయాల అనంతరం రామ్ తో హలో గురు ప్రేమకోసమే అనే సినిమా చేశాడు. కానీ ఆ సినిమా అంతగా వర్కౌట్ కాలేదు. ఇక సురేష్ బాబు నిర్ణయం మేరకు వెంకటేష్ కి మంచి కథను రెడీ చేసిన ఈ దర్శకుడికి ఫైనల్ గా ఊహించని చేదు అనుభవం ఎదురైంది. నెక్స్ట్ అదే ప్రాజెక్ట్ ని రవితేజతో చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All