Homeటాప్ స్టోరీస్వెంకీ డామినేషన్ కంటిన్యూ అవుతోంది

వెంకీ డామినేషన్ కంటిన్యూ అవుతోంది

Venkatesh domination in Venky Mama
Venkatesh domination in Venky Mama

ఇప్పుడు ఎవరైనా యంగ్ హీరో మల్టీస్టారర్ చేయాలంటే వెంకటేష్ బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తున్నాడు. మల్టీస్టారర్ అంటే చాలా మంది హీరోలు ఆలోచిస్తూ ఉంటారు కానీ వెంకీ మాత్రం కథ నచ్చితే మరో హీరో ఎవరన్నది కూడా పెద్దగా పట్టించుకోడు. ఈ నేపథ్యంలో యంగ్ హీరోలు వెంకటేష్ తో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కాకపోతే వాళ్ళు గమనించనిది ఏంటంటే ఆ సినిమాల్లో వెంకటేష్ పాత్ర పరంగా డామినేట్ చేసేస్తూ ఉంటాడు. ఉదాహరణకు ఈ ఏడాది రిలీజై బ్లాక్ బస్టర్ సాధించిన ఎఫ్ 2 చిత్రాన్ని తీసుకుంటే ఆ సినిమాలో కామెడీ అనగానే వెంకటేష్ పాత్రే గుర్తొస్తుంది. అసలు ఎఫ్ 2 అనగానే ముందు వెంకీనే మదిలో మెదులుతాడు. మరో హీరో వరుణ్ తేజ్ కూడా కామెడీ బానే పంచినా, తన వంతుగా సినిమాకు చేయాల్సిందంతా చేసినా కూడా వెంకటేష్ డామినేషన్ మాత్రం స్పష్టం. కామెడీ పండించడంలో, ఫ్యామిలీ ఆడియన్స్ ను అట్ట్రాక్ట్ చేసుకోవడంలో వెంకీ శైలి అలాంటిది.

ఒక్క వెంకీ మామ అనే కాదు, మసాలా తీసుకున్నా రామ్ ను వెంకీ పూర్తిగా డామినేట్ చేసేసాడు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు తప్పితే వెంకటేష్ తో ఎవరు నటించినా కానీ వెంకీ డామినేషన్ ముందు నిలబడట్లేదు. ఈ నేపథ్యంలో రిలీజ్ కు రెడీ అవుతోన్న వెంకీ మామ గురించి చర్చ ఆసక్తికరంగా ఉంది. ఇందులో కూడా వెంకీ డామినేషన్ స్పష్టంగా తెలుస్తోంది. ట్రైలర్ కూడా వెంకీ ప్రధానంగానే నడవడం విశేషం. వెంకీ మామలో కామెడీతో పాటు వివిధ రకాల ఎమోషన్స్ ఉన్నాయి. వాటిని పండించడంలో వెంకీ తనదైన శైలి చూపించాడని అర్ధమైపోతుంది. ఎమోషన్స్ ను బాగా పండిస్తాడు కాబట్టి దర్శకులకు కూడా వెంకీకు ఎక్కువ స్కోప్ ఇవ్వడం బెటర్ అనిపిస్తూ ఉండొచ్చు. మొత్తానికి టైటిలే వెంకీ ప్రధానంగా ఉంది కాబట్టి వెంకీ మామ విషయంలో కూడా తన డామినేషనే నడుస్తుంది అనడంలో సందేహం లేదు.

- Advertisement -

ఎమోషన్స్ ప్రధానంగా ఉన్న వెంకీ మామకు రిలీజ్ విషయంలో చాలానే కన్ఫ్యూజన్ నడిచిన సంగతి తెల్సిందే. ముందు సంక్రాంతి అని, తర్వాత క్రిస్మస్ అని అనుకున్నా చివరికి వెంకటేష్ పుట్టినరోజు అయిన డిసెంబర్ 13నే చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ట్రైలర్ విడుదలకు ముందు అంచనాల విషయంలో ఎలా ఉన్నా కానీ ట్రైలర్ విడుదలయ్యాక మాత్రం ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో వెంకీ మామ ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకూ అందుకుంటాడో చూడాలి.

ఈ చిత్రంలో రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తోన్న విషయం తెల్సిందే. థమన్ సంగీతం అందించగా, సురేష్ బాబుతో కలిసి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో వెంకటేష్ రైతుగా కనిపించగా, నాగ చైతన్య ఆర్మీ మేజర్ పాత్రలో నటించాడు. మామ అల్లుళ్ళ మధ్య అనుబంధం ప్రధానంగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. కేవలం కామెడీ మాత్రమే కాకుండా యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని ఎమోషన్స్ కవర్ అయ్యేలా చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు బాబీ.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All