Homeటాప్ స్టోరీస్హీరో వెంకటేష్ కూతురు పెళ్లి నవంబర్ 24 న ?

హీరో వెంకటేష్ కూతురు పెళ్లి నవంబర్ 24 న ?

Venkatesh daughter ashritha marriage date fixసీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత పెళ్లి ఈనెల 24 న జరుగనున్నట్లు తెలుస్తోంది . వెంకటేష్ కు ముగ్గురు కూతుర్లు ఒక కొడుకు కాగా పెద్ద కూతురు ఆశ్రిత . మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి దగ్గరి మిత్రుడు రఘురామి రెడ్డి తనయుడితో ఆశ్రిత వివాహం జరుగనుంది . ఆశ్రిత ది లవ్ మ్యారేజ్ . తన ప్రేమ విషయాన్నీ తండ్రి వెంకటేష్ కు అలాగే పెద్దనాన్న దగ్గుబాటి సురేష్ బాబు కి చెప్పడంతో మొదట కాస్త షాక్ కి గురైనప్పటికీ తర్వాత లైట్ గా తీసుకొని ఆశ్రిత ప్రేమ వివాహానికి పచ్చజెండా ఊపారు . దగ్గుబాటి సురేష్ బాబు దగ్గరుండి మరీ పెళ్లి వ్యవహారాలు చక్కబెడుతున్నాడట .

ఇక పెళ్లి కొడుకు తరుపువాళ్ళు కూడా బాగా డబ్బున్న వాళ్ళు కావడంతో ఈ ప్రేమ పెళ్లి కుదిరింది . నవంబర్ 24న ఆశ్రిత పెళ్లి ముహూర్తం నిర్ణయించినట్లు తెలుస్తోంది . ఈ పెళ్ళికి టాలీవుడ్ ప్రముఖులతో పాటుగా ఇతర భాషలకు చెందిన సినీ ప్రముఖులు అలాగే దేశ వ్యాప్తంగా దగ్గుబాటి ఫ్యామిలీ కి తెలిసిన రాజకీయ ప్రముఖులను కూడా ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది .

- Advertisement -

English Title: Venkatesh daughter ashritha marriage date fix

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All