Homeటాప్ స్టోరీస్రానా నాయుడుగా మన ముందుకు రానున్న బాబాయ్, అబ్బాయ్

రానా నాయుడుగా మన ముందుకు రానున్న బాబాయ్, అబ్బాయ్

రానా నాయుడుగా మన ముందుకు రానున్న బాబాయ్, అబ్బాయ్
రానా నాయుడుగా మన ముందుకు రానున్న బాబాయ్, అబ్బాయ్

దగ్గుబాటి రానా, దగ్గుబాటి వెంకటేష్ లు కలిసి నటించాలని ఎప్పటినుండో అభిమానులు కోరుకుంటున్నారు. కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంలో ఇద్దరూ కలిసి కాసేపు ఒక పాటలో కనిపిస్తారు. అయితే వీరిద్దరూ కలిసి ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ ద్వారా మన ముందుకు వస్తున్నారు. దీనికి సంబందించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ ఎప్పుడో మొదలైంది.

ఐతే ఈరోజు రానా దీన్ని అధికారికంగా ప్రకటించాడు. నెట్ ఫ్లిక్స్ కోసం చేసే ఈ వెబ్ సిరీస్ టైటిల్ ను రానా నాయుడుగా నిర్ణయించారు. ఢీ అంటే ఢీ అనేలా ఇద్దరి పాత్రలూ ఉంటాయని తెలుస్తోంది. అలాగే ఈ సిరీస్ కోసం వెంకీ లుక్ కూడా చాలా కొత్తగా భలే ఉంది. వెంకీ  ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురుచూదగ్గ సిరీస్ ఇది.

- Advertisement -

అమెరికన్ క్రైమ్ డ్రామా రే డొనోవన్ సిరీస్ కు తెలుగు వెర్షన్ గా ఈ సిరీస్ రూపొందుతోంది. కరణ్ అన్షుమన్, సుపర్న్ ఎస్ వర్మ ఈ సిరీస్ ను డైరెక్ట్ చేయబోతున్నారు. రానా నాయుడు సిరీస్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All