
సినిమా ఇండస్ట్రీలో గత 20 ఏళ్లుగా వివిధ విభాగాల్లో వర్క్ చేస్తూ తనకంటే ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు వాశిలి శ్యామ్‌ప్రసాద్. గత ఏడేళ్లుగా సినిమాటోగ్రాఫర్‌గా పలు సక్సెస్ ఫుల్ చిత్రాలకు పనిచేసిన వాశిలి శ్యామ్ ప్రసాద్ విజయదశమి సందర్భంగా నూతన నిర్మాణ సంస్థని ప్రారంభించారు. నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. అభిరుచి గల నిర్మాతగా అత్యుత్తమ చిత్రాల్ని అందించబోతున్నారు.
ఈ సందర్భంగా వాశిలి శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ `చెడుపై మంచి సాధించిన రోజు దసరా. అమ్మవారి ఆశీస్సులతో కరోనా మహమ్మారి నుంచి ప్రజలు కోలుకుంటున్న వేళ విజయదశమి శుభ సందర్భంగా మా నూతన నిర్మాణ సంస్థని ప్రారంభించడం ఆనందంగా వుంది. ప్రేక్షకుల్ని అలరించే యూత్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో పాటు యూత్‌ని ఎట్రాక్ట్ చేసే ప్రేమకథా చిత్రాలు, మరియు ఇంటిల్లిపాది చూసే కుటుంబ కథా చిత్రాలు నిర్మించాలన్నదే మా సప్త స్వర క్రియేషన్స్ ప్రధాన ఉద్దేశ్యం` అన్నారు.
సంవత్సరానికి 4 సినిమాలు నిర్మించాలనే కృతనిశ్చయంతో వున్నాము. అలాగే ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేయగల సినిమాలకు రూపకల్పన చేయగల టాలెంట్ వున్న నటీనటులకు, టెక్నీషియన్‌లకు అవకాశం కల్పించడం మా సంస్థ ప్రధాన ఉద్దేశ్యం. మా సంస్థ చేపట్టబోయే ప్రాజెక్ట్స్ వివరాల్ని త్వరలోనే తెలియజేస్తాం` అన్నారు.