
ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందించిన `అష్టాచమ్మా` చిత్రంతో నటుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు అవసరాల శ్రీనివాస్. ఈ మూవీతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఆయన ఆ తరువాత `ఊహలు గుసగుసలాడే`, జ్యో అచ్యుతానంద` వంటి చిత్రాలతో దర్శకుడిగానూ మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం నటుడిగా, దర్శకుడిగా బిజీగా వున్న ఆయనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.
సదరు వీడియోని అవసరాల శ్రీనివాస్ వద్ద గత నాలుగేళ్లుగా కో డైరెక్డర్‌గా వర్క్ చేస్తున్న మహేష్ అనే వ్యక్తి రిలీజ్ చేయడం సంచలనంగా మారింది. గత నాలుగేళ్లుగా అవసరాల శ్రీనివాస్ వద్ద తాను కో డైరెక్టర్గా వర్క్ చేస్తున్నానని, తనని అవసరంగా తిట్టి ఆఫీస్ నుంచి బయటికి పంపించారని, కారణం చెప్పమంటే చెప్పడం లేదని మహేష్ అనే కో డైరెక్టర్ ఓ వీడియోని పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుంత సోషల్ మీడియాతో పాటు యూట్యూబ్‌లోనూ వైరల్ గా మారింది.
అవసరాల శ్రీనివాస్ తన ఆఫీస్‌లో క్యాప్ పెట్టుకుని ఫొటోషూట్‌లో పాల్గొంటుండగా మహేష్ అనే వ్యక్తి అవసరాల అసలు బండారం బయటపెడతానంటూ అతని క్యాప్‌ని తొలగించాడు. దీంతో అవసరాల బట్ట తల దర్శనమిస్తోంది. ఇదే వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది నిజమా? కావాలనే ఈ వీడియో చేశారా అన్నది తెలియాల్సి వుంది.
