Sunday, December 4, 2022
Homeటాప్ స్టోరీస్బాబీ సింహా `వ‌సంత కోకిల‌` రేజ్ ఆఫ్ రుద్ర‌!

బాబీ సింహా `వ‌సంత కోకిల‌` రేజ్ ఆఫ్ రుద్ర‌!

బాబీ సింహా `వ‌సంత కోకిల‌` రేజ్ ఆఫ్ రుద్ర‌!
బాబీ సింహా `వ‌సంత కోకిల‌` రేజ్ ఆఫ్ రుద్ర‌!

జాతీయ అవార్డు గ్ర‌హీత బాబీ సింహా న‌టిస్తున్న బ‌హుభాషా చిత్రం `వ‌సంత కోకిల‌`. ర‌మ‌ణ‌న్ పురుషోత్త‌మ ఈ థ్రిల్ల‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్ ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మాణ సార‌థ్యంలో ఆర్‌.టీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ముద్ర ఫిల్మ్ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్స్‌పై ర‌జ‌నీ తాళ్లూరి, రేష్మీ సింహా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో బాబీ సింహాకి జోడీగా `న‌ర్త‌న‌శాల‌` ఫేమ్ క‌శ్మీర ప‌ర్దేశి న‌టిస్తోంది.

- Advertisement -

ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ కి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. తాజాగా మంగ‌ళ‌వారం ఈ చిత్ర మోష‌న్ పోస్ట‌ర్‌ని `రేజ్ ఆఫ్ రుద్ర` పేరుతో మేక‌ర్స్ రిలీజ్ చేశారు. స్ట‌న్నింగ్ విజువ‌ల్స్‌తో టైటిల్ మోష‌న్ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది. రాజేష్ మురుగేష‌న్ అందించిన నేప‌థ్య సంగీతం ఇంటెన్సీవ్‌గా థ్రిల్‌ని క‌లిగిస్తోంది. ఈ మోష‌న్ పోస్ట‌ర్‌కు వీడియో గ్లింప్స్‌ని జోడించారు.

రొమాంటిక్ థ్రిల్ల‌ర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ మూవీ జోన‌ర్‌కి, బాబీ సింహా అత్యుత్త‌మ న‌ట‌న‌కు త‌గిన విధంగానే వ‌సంత కోకిల‌ను ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తున్నార‌ని, జాతీయ అవార్డు గ్ర‌హీత‌, విల‌క్ష‌ణ హీరో క‌మ‌ల్‌హాస‌న్‌, శ్రీ‌దేవి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `వ‌సంత కోకిల‌` ఏ స్థాయి విజ‌యాన్ని సాధించిందో అంద‌రికి తెలిసిందే. అదే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ మూవీ కూడా అదే స్థాయి విజ‌యాన్ని సాధింస్తుంద‌ని న‌మ్మ‌కంగా చెబుతున్నారు నిర్మాత రామ్ తాళ్లూరి. థింక్ మ్యూజిక్ ఈ చిత్ర ఆడియో రైట్స్‌ని సొంతం చేసుకుంది.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts