Homeటాప్ స్టోరీస్వరుణ్ బాబు చాలా స్పీడ్ గా ఉన్నాడుగా

వరుణ్ బాబు చాలా స్పీడ్ గా ఉన్నాడుగా

వరుణ్ బాబు చాలా స్పీడ్ గా ఉన్నాడుగా
వరుణ్ బాబు చాలా స్పీడ్ గా ఉన్నాడుగా

యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ మొదటి నుండి తన రూట్ సెపరేట్ అన్నట్లుగానే వెళ్తున్నాడు. కథల ఎంపికలో మొదటినుండి వరుణ్ ది ప్రత్యేకమైన శైలి. కథలో ఏదైనా కొత్తదనం ఉంటేనే ఎంపిక చేసుకున్నాడు. అందుకే కెరీర్ మొదట్లోనే ముకుంద, కంచె వంటి మంచి సినిమాలు చేసాడు. అయితే మధ్యలో కొన్ని తప్పటడుగులు కూడా పడ్డాయి లెండి. అది వేరే విషయం. అయితే ఈ మధ్య వరుణ్ మూవీ సెలక్షన్స్ దేనికవే భిన్నంగా ఉంటున్నాయి. ఫిదాతో క్లాస్ హిట్ కొట్టాడు. ఎఫ్ 2తో కామెడీనూ ట్రై చేసాడు. ఇక గద్దలకొండ గణేష్ చిత్రంతో నెగటివ్ షేడ్స్ పై కూడా ఓ కన్నేశాడు. 2019లో రెండు భారీ హిట్స్ కొట్టిన వరుణ్, నెక్స్ట్ సినిమా మొదలుపెట్టడానికి బాగా సమయం తీసుకున్నాడు.

దాదాపు నాలుగు నెలల తన నెక్స్ట్ సినిమాకు సంబంధించి ప్రిపేర్ అయ్యాడు. వరుణ్ తేజ్ తన తర్వాతి చిత్రాన్ని ఒక నూతన దర్శకుడితో చేస్తున్న సంగతి తెల్సిందే. బాక్సింగ్ నేపధ్యమున్న ఈ సినిమాకోసం నాలుగు నెలలు ముంబై వెళ్లి అక్కడ నిష్ణాతులైన నిపుణుల సమక్షంలో బాక్సింగ్ కు ట్రైనింగ్ తీసుకున్నాడు. గత నెలలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. రెండు వారాలకు పైగా వైజాగ్ లో షూటింగ్ లో జరుపుకున్న ఈ చిత్ర యూనిట్ నిన్నటితో దాన్ని ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. వరుణ్ తేజ్ ఈ విషయాన్ని అధికారికంగా తన సోషల్ మీడియా పేజ్ లో చెప్పాడు. ఇది వరుణ్ కెరీర్ లో పదవ చిత్రం.

- Advertisement -

నెక్స్ట్ షెడ్యూల్ మరికొన్ని రోజుల్లో హైదరాబాద్ లో మొదలవుతుందని సమాచారం. వరుణ్ తేజ్ కు పోటీగా నెగటివ్ క్యారెక్టర్ లో నవీన్ చంద్ర కనిపించనున్నాడు. తాను కూడా ఈ సినిమా కోసం 45 రోజుల ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు సమాచారం. అల్లు వెంకటేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకుడు. షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి జులైలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All