Homeగాసిప్స్వరుణ్ తేజ్ గని మరోసారి వాయిదా పడుతుందా?

వరుణ్ తేజ్ గని మరోసారి వాయిదా పడుతుందా?

వరుణ్ తేజ్ గని మరోసారి వాయిదా పడుతుందా?
వరుణ్ తేజ్ గని మరోసారి వాయిదా పడుతుందా?

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన బాక్సింగ్ డ్రామా గని డిసెంబర్ 24న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. ముందుగా డిసెంబర్ 3న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు కానీ డిసెంబర్ 2కి బాలకృష్ణ అఖండ వస్తుండడంతో తమ చిత్రాన్ని క్రిస్మస్ వీకెండ్ కు మార్చారు. అయితే అదే రోజున నాని శ్యామ్ సింగ రాయ్ వస్తోంది. ఈ చిత్ర టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

శ్యామ్ సింగ రాయ్ నిర్మాతలతో శ్యామ్ సింగ రాయ్ రిలీజ్ డేట్ మార్చుకునే విషయంపై గని నిర్మాతలు చర్చలు చేపట్టారు. అయితే శ్యామ్ సింగ రాయ్ విడుదల తేదీని తాము ఎప్పుడో ప్రకటించామని, దాని ప్రకారంగా ప్రమోషన్స్ కూడా చేపడుతున్నామని, బయ్యర్లు కూడా క్రిస్మస్ వీకెండ్ రిలీజ్ కే ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు విడుదల వాయిదా వేయలేమని తెలిపారు.

- Advertisement -

ఇక అల్లు అరవింద్ కూడా పుష్ప విడుదలైన వారం రోజులకే గని కూడా రావడం ఇష్టం లేదు. అల్లు అర్జున్ అన్న బాబీ, గని నిర్మాతల్లో ఒకరన్న విషయం తెల్సిందే. దీంతో గని మరోసారి వాయిదా పడే అవకాశాలు లేకపోలేదు. ఈ చిత్రం రిపబ్లిక్ డే వీకెండ్ కు వాయిదా పడొచ్చని అంటున్నారు. పూర్తి క్లారిటీ మరికొన్ని రోజుల్లో వస్తుంది.

ఇవి కూడా చదవండి:

వరుణ్ తేజ్ సినిమాలో తమన్నా కూడానా?

జిమ్ లో చెమటలు చిందిస్తోన్న వరుణ్ తేజ్

వరుణ్ తేజ్ గని కోసం హోలీవడ్ టీమ్ దిగుతోంది

వరుణ్ తేజ్ చాలా మంచి వాడు అంటున్న దర్శకుడు

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All