
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన గని మూవీ రిలీజ్ డేట్స్ మారుస్తూ అభిమానులను నిరాశపరుస్తూ వస్తుంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ మార్చి 04 న వస్తుందని అనుకుంటే..ఇప్పుడు ఏకంగా ఏప్రిల్ 08 కి వాయిదా పడింది. గద్దలకొండ గణేష్ తర్వాత వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని ఎందుకున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా ఈ చిత్రం ద్వారా పరిచయమవుతున్నాడు.
ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని సిద్దు ముద్దా, అల్లు బాబీ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో వరుణ్ బాక్సర్‌గా కనిపించబోతున్నాడు.అలాగే ఈ సినిమాలో జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా ఓ స్పెషల్ సాంగ్‌లో సందడి చేయడం విశేషం. గత నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా భీమ్లా నాయక్ రిలీజ్ అయిన నేపథ్యంలో వాయిదా పడింది. ఇప్పుడు కొత్త తేదీని ప్రకటిస్తూ సోషల్ మీడియాలో తాజాగా అప్‌డేట్ ఇచ్చారు.