
సినిమాలు అనేది ఒక వింత ప్రపంచం. సరిగ్గా చెప్పాలంటే సినిమా ఒక వైకుంఠపాళి ఆట లాంటిది. వైకుంఠపాళి ఆట – సినిమా ప్రపంచం ఒకేలా ఉంటాయి. వైకుంఠపాళి లో నిచ్చెన వస్తే పైకి వెళ్ళిపోతాం అలాగే పాము మింగితే కిందకి దిగిపోతాం. సినిమా కూడా అంతే హిట్ నేమ్ వస్తే ఒక మంచి స్థాయి కి వెళ్ళిపోతాం వరుసగా ఫ్లాప్స్ వస్తే అసలు వాళ్ళని పట్టించుకోరు జనాలు.
ఇప్పుడు కథానాయికలకు మరియు కథా నాయకుడికి కూడా అలా హిట్ నేమ్ వచ్చిందంటే ఇక అంతే నిర్మాతలకి వారి రెమ్యూనరేషన్ రెట్టింపు పెంచేసి చెప్పేస్తారు. నిర్మాతలు కూడా సరే అని వారు అడిగిన అంత డబ్బు ఇచ్చేస్తారు. ‘గద్దలకొండ గణేష్‘ సినిమా ద్వారా హిట్ లిస్ట్ లోకి చేరిన ‘వరుణ్ తేజ్‘ తన రెమ్యూనరేషన్ పెంచేసాడు. కారణం వరుసగా సినిమాలు చేసుకుంటూ మంచి కథలని సెలెక్ట్ చేసుకుంటున్నాడు కాబట్టి. ఇది మన టాలీవుడ్ లో జరిగిన సంఘటన.
ఇక బాలీవుడ్ విషయానికి వస్తే ఢిల్లీ భామ ‘తాప్సి’ కూడా తన రెమ్మ్యూనరేషన్ పెంచేసింది. ఇప్పటివరకు బాలీవుడ్ లో తాప్సి నటించిన సినిమాలు ఒక్కటి కూడా ఫ్లాప్ దిశగా పోలేదు. ఒక్కొక్క సినిమాలో తన నటన మరియు ఎంచుకునే కథలు ఆమెని బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో ఒకరిగా చేర్చాయి. జనరల్ గా అయితే ఎవరైనా కథా నాయికలు తమ రెమ్యూనరేషన్ పెంచిన విషయం బయటికి రానివ్వరు. కానీ తాప్సి మాత్రం అందుకు విభిన్నంగా ఉంది.
అవును నేను నా సినిమాలు వరుసగా విజయాల బాట పడుతున్నాయని చెప్పి నా రెమ్యూనరేషన్ పెంచేసాను. ఇందులో నేను ఖచ్చితంగా నా రెమ్యూనరేషన్ పెంచాలి అని ఏమి అనుకోలేదు నిర్మాతలు వారంతా వారే ఇంత అని చెప్పి ఇస్తున్నారు. అయినా మేము ఒక్కొక్క సినిమాకి చాలా బాగా కష్ట పడుతాం కాబట్టి అలా అడగటం లో తప్పు లేదు అంటుంది ఈ ముద్దుగుమ్మ. మరి చూద్దాం ఇలా వరుసగా సినిమాలు హిట్ అయ్యినందుకు ఇలా చేస్తుంది, మరి 2,3 ఫ్లాపులు పడితే ఎలా మాట్లాడుతుందో చూద్దాం! అని విమర్శకులు అనుకుంటున్నారు.