
మెగా హీరో వరుణ్ తేజ్ డిఫరెంట్ జోనర్స్ కు చెందిన సినిమాలు చేస్తూ తన కెరీర్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు. వరస హిట్స్ తో మంచి ఊపు మీదున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం గని చిత్రాన్ని చేస్తోన్న విషయం తెల్సిందే. స్పోర్ట్స్ జోనర్ లో రూపొందుతోన్న ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్ గా కనిపించనున్నాడు.
ప్రస్తుతం వరుణ్ తేజ్ ఈ చిత్ర తాజా షెడ్యూల్ కోసం సన్నద్ధమవుతున్నాడు. వచ్చే వారం నుండి షెడ్యూల్ మొదలవుతుంది. ఇక వరుణ్ జిమ్ లో కండలు పెంచే పనిలో పడ్డాడు. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్స్ లారెన్ స్టోవల్, వ్లాడ్ రీంబుర్గ్ గని కోసం పనిచేస్తున్నారు. వీరు గతంలో టైటాన్స్, సల్మాన్ ఖాన్ సుల్తాన్ సినిమాల కోసం పనిచేసారు.
వరుణ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియో బట్టి గనిలో హార్డ్ కోర్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని అర్ధమవుతోంది. కిరణ్ కొర్రపాటి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సాయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది.
View this post on Instagram