Homeటాప్ స్టోరీస్బాలయ్యని తిట్టడంలో తప్పు లేదన్న వరుణ్ తేజ్

బాలయ్యని తిట్టడంలో తప్పు లేదన్న వరుణ్ తేజ్

Varun tej responds on nagababu commentsమా నాన్న నాగబాబు బాలయ్య ని తిట్టడంలో తప్పులేదు అని సమర్ధించాడు మెగా హీరో వరుణ్ తేజ్ . తాజాగా అంతరిక్షం చిత్రం కోసం ఇచ్చిన ఇంటర్వ్యూ లో వరుణ్ ఇలా దొరికిపోయాడు . అంతేకాదు అసలు బాలయ్య ని నాగబాబు ఎందుకు తిట్టాల్సి వచ్చిందో కూడా చెబుతున్నాడు . ఒక సందర్భంలో బాలయ్య పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలీదు అని అనడమే ఇందుకు కారణమని తేల్చి పడేసాడు . బాలయ్య ని ఎందుకు తిట్టావ్ నాన్న అని అడిగితే ఈ విషయం చెప్పాడని అందులో తప్పేమి లేదని సమర్ధిస్తున్నాడు వరుణ్ తేజ్ .

ఇటీవలే బాలయ్య ఎవరో నాకు తెలీదు అని నాగబాబు చెప్పి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . ఆ విషయం రచ్చ రచ్చ అయ్యింది . కట్ చేస్తే నాగబాబు పై బాలయ్య అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు . అయినప్పటికీ నాగబాబు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు . నా తమ్ముడ్ని విమర్శిస్తే నేను సహించేది లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు నాగబాబు . దాన్ని సమర్ధిస్తున్నాడు వరుణ్ తేజ్ .

- Advertisement -

English Title: Varun tej responds on nagababu comments

Varun tej responds on nagababu comments

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All