Homeటాప్ స్టోరీస్వైర‌ల్‌గా మారిన మెగా ప్రిన్స్ పోస్ట్‌!

వైర‌ల్‌గా మారిన మెగా ప్రిన్స్ పోస్ట్‌!

వైర‌ల్‌గా మారిన మెగా ప్రిన్స్ పోస్ట్‌!
వైర‌ల్‌గా మారిన మెగా ప్రిన్స్ పోస్ట్‌!

సోష‌ల్ మీడియాలో టాలీవుడ్ స్టార్స్ ఆల్ మోస్ట్ యాక్టీవ్‌గా వుంటున్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల గురించి, క‌రోనాతో పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్‌పై త‌ర‌చూ పోస్ట్‌లు పెడుతున్నారు. వారిని ఎంక‌రేజ్ చేస్తున్నారు. జ‌నాల‌ని కూడా క‌రోనా కాలంలో మ‌రింత జాగ్ర‌త్త‌గా వుండాలని కొంత మంది స్టార్స్‌ హెచ్చ‌రిస్తుంటే మ‌రి కొంత మంది మాత్రం ప్రాణాంత‌క క‌రోనాతో జాగ్ర‌త్త అని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

మ‌రి కొంత మందైతే త‌మ వంతు బాధ్య‌త‌గా ప‌నిలేని వారికి నిత్యావ‌స‌రాలు అందిస్తూ త‌మ ఉదార‌త‌ను చాటుకుంటున్నారు. ఇదిలా వుంటే మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ సోష‌ల్ మీడియా ఇన్ స్టా వేదిక‌గా పెట్టిన ఓ పోస్ట్ వైర‌ల్‌గా మారింది. ఆయ‌న షేర్ చేసిన సింగిల్ లైన్ పోస్ట్ ప్ర‌స్తుత ప‌రిస్థితికి అద్దంప‌డుతోంది. `ఈ ఏడాది మా ప్లాన్స్ అన్నీ బ్ల‌ర్ అ‌యిపోయాయి` అని వ‌రుణ్ క‌రోనా కార‌ణంగా సినీ ఇండ‌స్ట్రీ, సినీ స్టార్స్ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై స్పందించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

- Advertisement -

క‌రోనా కార‌ణంగా జ‌న‌జీవితం స్థంభించిపోయింది. లాక్‌డౌన్ విధించ‌డంతో మూడు నెల‌ల పాటు కార్య‌క‌లాపాల‌న్నీ స్థంభించిపోయాయి. సినీ ప‌రిశ్ర‌మ పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయ‌మింది. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా రంగాల‌కు లాక్‌డౌన్ స‌డ‌లించినా సినీ ప‌రిశ్ర‌మ మాత్రం ఇంకా లాక్‌డౌన్‌ని అనుభ‌విస్తూనే వుంది. షూటింగ్‌ల‌కు అనుమ‌తులు ఇచ్చినా క‌రోనా భ‌యంతో అతి త‌క్కువ మందితో షూటింగ్ చేయ‌డం కుద‌ర‌ని ప‌ని అని చాలా మంది హీరోలు క‌రోనా పూర్తిగా నిర్మూల‌న అయ్యాకే సెట్స్‌కి రావాల‌నుకుంటున్నారు. దీంతో ఈ ఏడాది వారి ప్లాన్స్ అన్నీ త‌ల‌క్రిందులవుతున్నాయి. వ‌రుణ్‌తేజ్ బాక్సింగ్ నేప‌థ్యంలో ఓ సినిమా స్టార్ట్‌ చేశాడు. అల్లు అర్జున్ సోద‌రుడు అల్లు బాబీ నిర్మాత. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. క‌రోనా కార‌ణంగా ఈ సినిమా షెడ్యూల్ అంతా చిన్నా భిన్నం అయింది. ఇదే వ‌రుణ్‌తేజ్‌ని బాధిస్తోంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే వ‌రుణ్ తాజా పోస్ట్ పెట్టిన‌ట్టు తెలుస్తోంది.

 

View this post on Instagram

 

Blurred! Just like our plans this year! #2020

A post shared by Varun Tej Konidela (@varunkonidela7) on

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All