Monday, October 3, 2022
Homeటాప్ స్టోరీస్వ‌రుణ్‌తేజ్ `గ‌ని` థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేది అప్పుడే

వ‌రుణ్‌తేజ్ `గ‌ని` థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేది అప్పుడే

వ‌రుణ్‌తేజ్ `గ‌ని` థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేది అప్పుడే
వ‌రుణ్‌తేజ్ `గ‌ని` థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేది అప్పుడే

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సర్ గా న‌టిస్తున్న తాజా చిత్రం `గ‌ని`. స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కితున్న ఈ చిత్రం ద్వారా కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రీనైసెన్స్ పిక్చ‌ర్స్ అల్లు బాబీ కంప‌నీ బ్యాన‌ర్‌పై అల్లు బాబీ, సిద్దు ముద్ద సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -

ఇటీవ‌లే హీరో వ‌రుణ్‌తేజ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్ర టైటిల్ ఫ‌స్ట్ లుక్ తో పాటు మోష‌న్ పోస్టర్ఏసిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర‌ రిలీజ్ డేట్‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వున్న ఈ చిత్రాన్ని మేకర్స్ 2021 జూలై 30 న థియేటర్‌ల‌లోకి తీసుకొస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.ఇందులో వ‌రుణ్‌తేజ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ స‌యీ మంజ్రేక‌ర్ కనిపించనున్నారు

వ‌రుణ్ ప‌వ‌ర్‌ఫుల్ బాక్స‌ర్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలోని ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో క‌న్న‌డ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాక్స‌ర్‌గా క‌నిపించ‌డం కోసం హీరో వ‌రుణ్ తేజ్ చాలా క‌ఠోరంగా శ్ర‌మించి బాక్స‌ర్ లుక్‌లోకి త‌న‌ని తాను మార్చుకున్నారు. కొత్త త‌ర‌హా పాత్ర‌లో వ‌రుణ్ న‌టిస్తున్న ఈ మూవీ కూడా భారీ స్థాయిలో వుండ‌బోతోంద‌ని తెలుస్తోంది.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts