Homeటాప్ స్టోరీస్రింగులోకి దిగేందుకు బాక్స‌ర్ రెడీ!

రింగులోకి దిగేందుకు బాక్స‌ర్ రెడీ!

రింగులోకి దిగేందుకు బాక్స‌ర్ రెడీ!
రింగులోకి దిగేందుకు బాక్స‌ర్ రెడీ!

కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న‌మైన క‌థాంశాల్ని ఎంచుకుంటూ వ‌రుస విజ‌యాల్ని త‌న ఖాతాలో వేసుకుంటున్నారు యంగ్ హీరో వ‌రుణ్‌తేజ‌. ఫిదా, తొలిప్రేమ‌, ఎఫ్‌2 వంటి చిత్రాల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని సొంతం చేసుకున్న వ‌రుణ్ ఇటీవ‌ల `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌` పాత్ర‌లో స‌రికొత్త మేన‌రిజ‌మ్స్‌తో ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌న య‌వ ద‌ర్శ‌కుడు కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రంలో న‌టిస్తున్నారు.

అల్లు అర‌వింద్ పెద్ద కుమారుడు, స్టైలిష్ స్టార్ సోద‌రుడు అల్లు వెంక‌టేష్ గీతా ఆర్ట్స్‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌పైకి రాబోతున్న ఈ సినిమా కోసం గ‌త కొన్ని నెల‌లుగా వ‌రుణ్‌తేజ్ ఓ కోచ్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేకంగా బాక్సింగ్ లో శిక్ష‌ణ తీసుకుంటున్నారు. శిక్ష‌ణ పూర్తియిన వెంట‌నే బ‌రిలో దిగ‌డానికి సిద్ధమ‌వుతార‌ట‌. ఈ విష‌యాన్ని హీరో వ‌రుణ్‌తేజ్‌స‌క్ష‌ష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా శ‌నివారం వెల్ల‌డించారు. ల‌వ్ సింబ‌ల్ ఆకారంలో బాక్సింగ్ గ్లౌస్‌ని చూపిస్తూ ఓ ఫొటోని షేర్ చేయ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

- Advertisement -

`ఈ చిత్రానికి `బాక్సర్‌` అనే టైటిల్‌ని చిత్ర బృందం ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలిసింది. వ‌రుణ్‌తేజ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బ‌డ్జెట్‌తో స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్‌గా ఈ చిత్రాన్ని అల్లు వెంక‌టేష్ నిర్మించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. నిర్మాతగా ఆయ‌న‌కిది తొలి చిత్రం కావ‌డం, హీరో వ‌రుణ్‌తేజ్ న‌టిస్తున్న టెన్త్ ఫిల్మ్ కావ‌డంతో ఈ సినిమాపై ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో మంచి క్రేజ్ ఏర్ప‌డింది.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All