Homeటాప్ స్టోరీస్మాట‌ల‌కంద‌ని ఆనందంలో వ‌రుణ్ తేజ్‌!

మాట‌ల‌కంద‌ని ఆనందంలో వ‌రుణ్ తేజ్‌!

మాట‌ల‌కంద‌ని ఆనందంలో వ‌రుణ్ తేజ్‌!
మాట‌ల‌కంద‌ని ఆనందంలో వ‌రుణ్ తేజ్‌!

మెగా ప్రిన్సెస్‌.. నాగ‌బాబు గారాల ప‌ట్టి నిహారిక వివాహం ఈ నెల 9న గుంటూరుకు చెందిన ఐజీ జొన్న‌ల‌గ‌డ్డ ప్ర‌భాక‌ర్‌రావు త‌న‌యుడు జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌తో రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్ ఉద‌య్‌విలాస్‌లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఈ పెళ్లి కోసం వారం రోజులు ముందుగానే ఏర్పాట్లు మొద‌లుపెట్టారు. నాగ‌బాబు ఇంట్లో పెళ్లి కూతురు ముస్తాబుతో హంగామా మొఓద‌లైంది.

పెళ్లికి మూడు రోజుల ముందే మెగా ఫ్యామిలీల‌న్నీ ఉద‌య్‌పూర్‌కి ప్ర‌త్యేక విమానాల్లో చేరుకుని సంద‌డి చేశాయి. సంగీత్‌, మెహందీ కార్య‌క్ర‌మాల‌తో హంగామా చేశారు. చివ‌రి నిమిషంలో ఉద‌య్‌పూర్ చేరుకున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్ సంగీత్‌కి హాజ‌రు కాలేక‌పోయినా మెహందీ కార్య‌క్ర‌మంలో మెరిసారు. పెళ్లి సంద‌ర్భంగా మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబుఏ ఎమోష‌న‌ల్ అయ్యారు. ఇంకా త‌న చిట్టి త‌ల్లి చిన్న పిల్లేన‌ని భావోద్వేగానికి లోన‌య్యారు.

- Advertisement -

తాజాగా చెల్లెలు నిహారిక వివాహంపై వ‌రుణ్‌తేజ్ స్పందించారు. `నా బంగారు త‌ల్లి నిహారిక‌.. మా డ్యాషింగ్ బావ చైత‌న్య‌కు హ్యాపీ మ్యారీడ్ లైఫ్‌. నేనిప్పుడు ఎంత సంతోషంగా వున్నానో వ‌ర్ణించేందుకు మాట‌లు స‌రిపోవు` అంటూ వ‌రుణ్‌తేజ్ త‌న సోద‌రి నిహారికపై త‌న‌కున్న ప్రేమ‌ని బ‌య‌ట‌పెట్టడం ప‌లువురిని ఆక‌ట్టుకుంటోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All