Homeటాప్ స్టోరీస్వరుణ్ సందేశ్ మిస్ అయిన ఆ రెండు సూపర్ హిట్ సినిమాలు

వరుణ్ సందేశ్ మిస్ అయిన ఆ రెండు సూపర్ హిట్ సినిమాలు

వరుణ్ సందేశ్ మిస్ అయిన ఆ రెండు సూపర్ హిట్ సినిమాలు
వరుణ్ సందేశ్ మిస్ అయిన ఆ రెండు సూపర్ హిట్ సినిమాలు

జీవితంలో అయినా, కెరియర్ లో అయినా అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. ఒక్కొక్కోసారి మనకంటే మనకు వచ్చిన అవకాశం గొప్పదిగా ఉంటుంది. అప్పుడు మనం ఇగో లను పక్కన పెట్టి, ఆ అవకాశం ఉపయోగించుకుని ఇంకో మెట్టు పైకి ఎక్కాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం మిస్ అయినప్పుడే ఆ అవకాశం గొప్పతనం తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఫిలాసఫీ ఎందుకంటే,

కొంతమంది టాలీవుడ్ లో నోట్లో వెండి స్పూన్ తో పుట్టిన హీరోలు ఉన్నారు. వాళ్ళను ఎలాగు మాస్ జనం కనెక్ట్ అవ్వడం కష్టం. ఎదో లవ్ కథలు నాలుగు చేసుకుని హిట్లు కొట్టి ఫామ్ లోకి వస్తారు. కొన్ని సార్లు రాంగ్ డెసిషన్ వల్లనో.., రాంగ్ గైడెన్స్ వల్లో మంచి సబ్జెక్ లు మిస్ చేసుకుంటారు. ఆనక, సినిమాలు మిస్ అయ్యాక బాధ పడుతూ ఉంటారు. వాళ్ళల్లో మన ఎన్నారై స్టార్ వరుణ్ సందేశ్ కూడా ఉన్నారు . రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో తను తెలియక 100% లవ్, గుండె జారి గల్లంతయ్యిందే లాంటి సినిమాలు మిస్ చేసుకున్నానని చెప్పారు. తను ఫస్ట్ సినిమాకే తమన్నా తో చేశా కదా… అని 100% లవ్ సినిమాను, ఆల్రెడీ “ఔను… వాళ్లిదరూ ఇష్టపడ్డారు” సినిమా లాగే ఉంది కదా ! అని గుండె జారి…. సినిమాను వదులుకుని ఉండచ్చు. కానీ ఆ రెండు సినిమాలు పడి ఉంటె మన ఎన్నారై స్టార్ రేంజ్ ఎక్కడో ఉండేది. సరే..సరే.. లే ఎన్నెన్నో అనుకుంటాం… అన్నీ జరుగుతాయా ఏంటి.?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All