Homeటాప్ స్టోరీస్పెళ్లి గురించి అడిగితే వర్షిణికి ఎక్కడో కాలుతుందట

పెళ్లి గురించి అడిగితే వర్షిణికి ఎక్కడో కాలుతుందట


ఎవరికైనా ఇష్టంలేని ప్రశ్నను పదే పదే అడిగితే ఎక్కడో కాలుతుంది కదా..ఇప్పుడు వర్షిణి కి కూడా ఎవరైనా తన పెళ్లి గురించి అడిగితే అంతే కాలుతుంది. తాజాగా ఇదే మాటను ఆమె పరోక్షంగా తెలిపింది. మోడలింగ్ రంగంలో సత్తా చాటిన వర్షిణి.. ‘చందమామ కథలు’ అనే తెలుగు సినిమాతో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించింది. కానీ, ఇవేమీ ఆమెకు భారీ సక్సెస్‌ను కానీ, గుర్తింపును కానీ అందించలేకపోయాయి. దీంతో వర్షిణి సినిమాలకు దూరమైంది.

ఈ క్రమంలోనే ‘పెళ్లి గోల’ అనే వెబ్ సిరీస్‌ మాత్రమే ఆమెకు బ్రేక్‌ను ఇచ్చింది. ప్రస్తుతం బుల్లితెర, వెండితెర , వెబ్ సిరీస్ ఇలా అన్నింటిపై  ఫోకస్ పెట్టింది వర్షిణి. ఇక సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ పిక్స్ షేర్ చేస్తూ ఫాలోయర్స్ ను ఆకట్టుకుంటూ వస్తుంది. తాజాగా వర్షిణి ఓ పోస్ట్ చేసింది. 26 ఏళ్లు వచ్చాయ్ ఇంకా పెళ్లి కాలేదా? చేసుకోలేదా? అని ఎవరైనా ప్రశ్నిస్తే.. తాను ఇలా సమాధానం చెబుతానంటూ వర్షిణి పరోక్షంగా ఓ పోస్ట్ పెట్టేసింది. మనం 2022లోకి వచ్చాం.. అయినా కూడా మన పని మనం చేసుకోకుండా పక్కవారి గురించే ఆలోచిస్తున్నారా? అని అంటానన్నట్టుగా తెలిపింది. వర్షిణి లవ్ ఫెయిల్యూర్ అన్న సంగతి తెలిసిందే. గతంలోనే ఓ సారి నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ అది పెళ్లి పీటల వరకు వెళ్లలేదు. దీంతో అంత పెళ్లి ప్రస్తావనను తీసుకొస్తూ ఆమెకు చిరాకు తెప్పిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All